బాలీవుడ్‌కి ఆ తర్వాత మనకు ఓ హాటెస్ట్ బ్యూటీ కమ్ బెస్ట్ యాక్టర్ దొరికింది అంటే దానికి కారణమైన సినిమా ‘ధడక్’. మనసుల్ని మెలితిప్పేసే ఈ ప్రేమకథ ఆరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మరాఠీ సినిమా ‘సైరట్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే మొదటి పార్ట్‌లో చేసిన హీరోహీరోయిన్లను మారుస్తున్నట్లు తెలిపారు. ‘ధడక్’లో హీరోగా షాహిద్ కపూర్ (Shahid Kapoor) సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటించగా..
హీరోయిన్గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించి మెప్పించింది. ఇప్పుడు ‘ధడక్ 2’లో జాన్వీ స్థానంలో త్రిప్తి డిమ్రిని (Tripti Dimri) తీసుకుంటున్నారు. ఇషాన్‌కు బదులు సిద్ధాంత్ చతుర్వేదిని తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజపేస్తూ నిర్మాత కరణ్ జోహార్ పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్టును జాన్వీ లైక్ చేయడం విశేషం. ఇక ఈ సీక్వెల్‌కు షాజియా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, జాన్వీని కాదని త్రిప్తి డిమ్రిని ఎందుకు తీసుకున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
‘యానిమల్’ (Animal) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి. ఈ క్రమంలో ఆమె ఫేమ్‌ను వాడుకుని మరో బెస్ట్ మూవీ ఇవ్వాలని కరణ్ జోహార్ (Karan Johar) అనుకుంటున్నారని అర్థమవుతోంది. ఇక జాన్వీకి ‘ధడక్’ సినిమా ప్రత్యేకం. ఆ సినిమా ప్రచారం సమయంలోనే శ్రీదేవి (Sridevi) మరణించారు. తల్లి పోయిన బాధను మర్చిపోవడం కోసం జాన్వీ ఈ ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొన్నారు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగానే జాన్వీ ఈ సీక్వెల్‌ను చేయలేకపోతున్నట్లు సమాచారం. తొలిపార్టు ముగింపు విషాదంతో నిండి ఉంటుంది. మరిప్పుడు ఈ వెర్షన్ అంటే సీక్వెల్లో ఏం చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాను తొలి పార్టు నుండి కొనసాగించే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే తొలి పార్టు క్లైమాక్స్‌లో హీరో హీరోయిన్లు చనిపోతారు. అయితే బిడ్డ మాత్రం ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడి నుండి కథనా? లేక కొత్త కథను ఆ కాన్సెప్ట్‌లో చూపిస్తారో అనేది చూడాలి.