Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Advertisement

విజయ్‌ – త్రిష.. ఈ టాపిక్‌ గురించి ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నడుస్తూనే ఉంది. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది, ఇద్దరి బంధం ఏంటి? అనే చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ విషయంలో క్లారిటీ రావడం లేదు. రీసెంట్‌ విజయ్‌ జోసెఫ్‌ తమిళనాడు రాజకీయాల్లో రావడం, ఆ తర్వాత సీఎం అయ్యాక మరోసారి ఈ టాపిక్‌ చర్చలోకి వచ్చింది. విజయ్‌ సీఎం ప్రమాణ స్వీకారానికి త్రిష ప్రత్యేక ఆకర్షణగా రావడం.. రీసెంట్‌ అజిత్‌తో కలసి, విజయ్‌ దగ్గరకు వెళ్లడం లాంటివి ఈ చర్చ కొనసాగడానికి కారణమయ్యాయి. దాంతోపాటు ట్రోలర్స్‌ తమ టాలెంట్‌కి పని చెప్పారు.

Trisha

అయితే, ఈ విషయాలన్నీ ఆమె వద్దకు వెళ్లాయో లేక అనుకోకుండా పోస్ట్‌ చేసిందో కానీ.. ఓ ఆసక్తికరమైన క్రిప్టిక్‌ పోస్ట్‌ చేసింది. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై వచ్చే ఇలాంటి వార్తలపై స్పందించని త్రిష ఇప్పుడు పరోక్షంగా స్పందించింది. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్‌ చేసిన త్రిష ‘నా వ్యక్తిగత విషయాల్లో కలగజేసుకోవడానికి దీనికి మాత్రమే అనుమతి ఉంది’ అని రాసుకొచ్చింది. అంటే నా వ్యక్తిగత విషయాల్లో ఇతరులకు ఏం సంబంధం అని ప్రశ్నించినట్లయింది.

తన పోస్టులో త్రిష ఎవరి పేరు, ఏ విషయమూ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. తనపై రీసెంట్‌గా వస్తున్న రూమర్స్‌, క్రియేట్‌ చేస్తున్న వారిని ఉద్దేశించే ఆ పోస్ట్‌ పెట్టిందని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో ట్రోలర్లు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. మే నెల ప్రారంభంలోనూ ఆమె ఓ పోస్ట్‌ పెట్టింది. ‘నాకు ఇష్టమైన మంత్‌ వచ్చేసింది’ అని అప్పుడు రాయగా.. ‘ఈ ఏడాది మే నెలను తలచుకున్నప్పుడల్లా నా ముఖంపై చిరునవ్వు వస్తూనే ఉంటుంది’ అని కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది. ‘మ్యాజికల్‌ మే..’ అని కూడా రాసుకొచ్చింది.

 ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus