Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Advertisement

ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్..ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ పై విమర్శల వర్షం కురిపించారు. అందులో భాగంగా.. “విజయ్ కి రాజకీయాలు తెలీవని, ఆయన రియాలిటీలో లేరని, ముందుగా అతను త్రిషతో(Trisha) పెట్టుకున్న ఎఫైర్ నుండి బయటకి రావాలని” విమర్శించారు. దీంతో విజయ్ అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది నాగేంద్రన్ వ్యాఖ్యలు సరైనవి కాదని, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అజ్ఞానం అవుతుందని ఇలా రకరకాలుగా స్పందించారు. దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనమైంది.

Trisha

దీంతో ఈ విషయం పై హీరోయిన్ త్రిష కృష్ణన్ తన లాయర్ నిత్యేష్ నటరాజ్ తో ఓ నోట్ రిలీజ్ చేయించారు. “ఇటీవల ఈ రాజకీయ నాయకుడు త్రిషపై అభ్యంతరకర  వ్యాఖ్యలు చేశారు. వాటిని ఖండిస్తూ ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది.నా క్లైంట్ త్రిషకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు.  ఆమె ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించింది లేదు.ఒకరి వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా ప్రస్తావించి విమర్శలు చేయడం సరికాదు.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ప్రసంగించే ముందు పద్దతి, నిగ్రహం వంటివి పాటించాలి. ఇలాంటి అనవసరమైన విషయాల్లోకి త్రిష పేరును లాగొద్దు. ఆమె కేవలం ఒక నటి అని గుర్తించాలి. ఆమె పరువుకి భంగం కలిగే విధంగా లేని పోనీ వ్యవహారాల్లో త్రిష పేరుని ప్రస్తావించవద్దు” అంటూ నిత్యేష్ ఆ లేఖలో రాసుకొచ్చారు.

ఎన్నికల టైమ్లో రాజకీయ నాయకులు ఇలాంటి విమర్శలు చేయడం కామన్. కానీ విజయ్ సినిమా పరిశ్రమకి చెందిన వాడు కావడంతో ఇంకా డోసు పెంచి మాట్లాడినట్టు అర్దం చేసుకోవచ్చు.

నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus