టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిషకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తున్నా ఈ బ్యూటీ ఆ ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే త్రిష ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకోలేదు. ఒకవైపు నయనతార వరుసగా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకుంటుండగా త్రిషకు మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అయినప్పటికీ త్రిష ఏ ధైర్యంతో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారో అర్థం కావడం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్రిష ధైర్యానికి మెచ్చుకోవచ్చని మరి కొందరు వెల్లడిస్తున్నారు. త్రిషకు ఈసారైనా అదృష్టం వరించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సమయంలో కథల ఎంపికలో త్రిష మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి త్రిష పూర్తిస్థాయిలో దూరం కావడం నచ్చలేదని కొంతమంది చెబుతున్నారు. ది రోడ్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో త్రిష యాక్షన్ రోల్స్ లో కూడా నటించారని తెలుస్తోంది. మధురైలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.
త్రిష(Trisha) రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. త్రిష మరికొన్ని సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అరుణ్ వశీకరణ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. పాన్ ఇండియా మూవీగా ది రోడ్ మూవీ విడుదలవుతూ ఉండటం గమనార్హం.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?