Trisha: బాలీవుడ్ లో త్రిష ఎక్కువ సినిమాల్లో నటించకపోవడానికి కారణాలివే!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ రేంజ్ లో ఆఫర్లను సొంతం చేసుకుంటున్న త్రిషకు (Trisha Krishnan) ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. సౌత్ భాషల్లో వరుస సినిమాలలో నటిస్తున్న త్రిష కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎక్కువ సినిమాలలో నటించడం లేదు. కట్టా మిఠా అనే బాలీవుడ్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఈ సినిమాతో ఆశించిన రిజల్ట్ ను సొంతం చేసుకోలేదు. బాలీవుడ్ లో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

అయితే హిందీలో వరుసగా సినిమాలలో నటించకపోవడం గురించి తాజాగా త్రిష స్పందించి క్లారిటీ ఇచ్చారు. నేను నా ఫ్యామిలీని ముంబైకి మార్చడానికి సిద్ధంగా లేనని ఆమె తెలిపారు. కట్టా మిఠా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న తర్వాత తాను బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వైదొలిగానని ప్రచారం జరిగిందని త్రిష చెప్పుకొచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కావాలంటే సౌత్ లో చాలా ఆఫర్లను వదులుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.

అదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో నా ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాల్సి ఉంటుందని త్రిష కామెంట్లు చేశారు. అప్పట్లో నాకు అంత ఆసక్తి లేదని త్రిష చెప్పుకొచ్చారు. అందుకే హిందీ సినిమాలలో కంటిన్యూగా నటించలేదని ఆమె పేర్కొన్నారు. తెలుగులో విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తున్న త్రిష తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

విశ్వంభర మూవీలో త్రిష డ్యూయల్ రోల్ చేస్తున్నారని కూడా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే మేకర్స్ నుంచి మాత్రం స్పష్టత రాలేదు. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా అనుకున్న సమయానికే విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర హిట్టైతే తెలుగులో మరికొన్ని సంవత్సరాల పాటు త్రిష స్పీడ్ కు బ్రేకులు వెయ్యలేమని చెప్పవచ్చు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus