మాటల మాంత్రికుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో చాలా గ్యాప్ తరువాత రి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘సైరా’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే కొరటాల శివ చెప్పిన కథ బాగా నచ్చడంతో ‘సైరా’ తరువాత చిరూ, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక డైరెక్టర్ కొరటాల శివ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది లో ఉంటుందని చెబుతున్నారు.

ఇది ఇలా ఉంటె, డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా చిరంజీవి కి సరిపడే ఒక కథని సిద్ధం చేసాడట. ఇటీవలే చిరంజీవిని కలసిన త్రివిక్రమ్ కథ చెప్పడంతో ఆ కథ బాగా నచ్చి వెంటనే చిరంజీవి ఒకే చేసాడట. ఇక త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా పూర్తైన వెంటనే చిరంజీవి కథపైనే పూర్తి శ్రద్ద పెట్టనున్నాడట. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తాడని సమాచారం. ఇంకా చిరంజీవి, బోయపాటి కాంబినేషన్ లో కూడా ఒక సినిమా ఉంటుందనే వార్తలు వినిపించగా త్రివిక్రమ్ తో సినిమా తరువాతనే బోయపాటి సినిమా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus