పవన్ సినిమాకి త్రివిక్రమ్ చేసే మార్పులు ఇవే!

  • August 7, 2021 / 04:54 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్ చేసింది త్రివిక్రమ్ అనే సంగతి తెలిసిందే. దీంతో ఆయనే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారని.. ఒరిజినల్ వెర్షన్ కంటే రీమేక్ భిన్నంగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ హ్యాండ్ పడిందంటే భారీ మార్పులు తప్పనిసరి అని అనుకున్నారు. కానీ నిజానికి ఈ రీమేక్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదట. ఉన్నది ఉన్నట్లుగానే కాస్త స్టైలిష్ గా తీస్తున్నారట. ఒరిజినల్ వెర్షన్ కు దగ్గరగానే ఉంటుందని టాక్. మళయాలంలో లేని కొన్ని ఎపిసోడ్లు మాత్రమే త్రివిక్రమ్ జోడించాడని.. అది కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తెలుస్తోంది.

ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సోల్ అనేది మిస్ అవ్వకూడదని.. పాత్రలను, వాటి తీరుతెన్నులను త్రివిక్రమ్ ముట్టుకోలేదని సమాచారం. నిజానికి ఈ స్క్రిప్ట్ ను సాగర్ చంద్ర ముందే రాశారు. దానికి త్రివిక్రమ్ డైలాగ్స్ మార్చారు. ఒకట్రెండు కొత్త ఎపిసోడ్లు తెరపై కనిపిస్తాయని.. అవి మాత్రం త్రివిక్రమ్ జోడించాడని.. మిగిలినదంతా యాజిటీజ్ ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus