కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రేక్షకులు వినోదం కోసం ఓటీటీలపై, టీవీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు వెండితెర రిజల్ట్ తో సంబంధం లేకుండా బుల్లితెరపై రికార్డులను క్రియేట్ చేస్తాయి. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత సినిమా మాత్రం బుల్లితెరపై దారుణమైన రేటింగ్ ను తెచ్చుకుంది. ఇటీవల ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగులో
అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రసారం కాగా ఈ సినిమా అర్బన్ లో 2.05 రూరల్ లో 1.67 రేటింగ్ ను సొంతం చేసుకుంది. అయితే త్రివిక్రమ్ ఫ్యాన్స్ మాత్రం టీవీలో ఎక్కువసార్లు ప్రదర్శించడం వల్లే అరవింద సమేత మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకోలేకపోయిందని కామెంట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికీ బుల్లితెరపై మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నాయి.
అరవింద సమేత తక్కువ రేటింగ్ ను తెచ్చుకుంటే జెమినీ ఛానల్ లో ప్రసారమైన మహర్షి మాత్రం మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. అర్బన్ ప్రాంతాల్లో ఈ సినిమాకు 6.98 రేటింగ్ రాగా రూరల్ ఏరియాలో మాత్రం 5.48 రేటింగ్ వచ్చింది. మహర్షి మూవీకి గతంలో కూడా మంచి రేటింగ్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే. బిచ్చగాడు, టెడ్డీ సినిమాలు కూడా బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!