దేవీ తో తన గొడవ గురించి బయటపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చేవారిలో రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ఒకరు. హీరోకి తగ్గట్టు, కథకి అనుగుణంగా సంగీతాన్ని ఇవ్వడంలో నేర్పరి. అందుకే అతన్ని ఎక్కువమంది కోరుకుంటారు. అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తుంటారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం అతన్ని దూరం పెట్టారు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వచ్చిన జల్సా సూపర్ హిట్ అయింది. అలాగే ఆ తర్వాత జులాయి, అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలకు కలిసి పనిచేశారు. అవి కూడా విజయం సాధించాయి. అలాగే త్రివిక్ర‌మ్ అ..ఆ సినిమాకి దేవీని తీసుకుంటారని అనుకుంటే పక్కన పెట్టారు. దీంతో అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పుకున్నారు. గాసిప్ ని బలపరుస్తూ త్రివిక్రమ్ అజ్ఞాత‌వాసి, అర‌వింద స‌మేత చిత్రాల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్లను మార్చారు.

నిజంగానే దేవీకి, త్రివిక్రమ్ కి గొడవ జరిగిందని ఫిక్స్ అయిపోయారు. ఈ విషయాన్ని త్రివిక్రమ్ ముందు ఉంచగా అతను క్లారిటీ ఇచ్చారు. ” దేవీ శ్రీ ప్ర‌సాద్‌తో నేను ఎక్కువ‌గా సినిమాలు చేశాను. అత‌నితో నాకు చాలా కంఫ‌ర్ట్‌గా ఉంటుంది. నా గత మూడు చిత్రాల‌కు దేవీని తీసుకోక‌పోవ‌డం వెనుక పెద్ద కార‌ణాలు లేవు. అ..ఆ చిత్రం లోబ‌డ్జెట్‌తో తెరకెక్కింది. రెమ్యున‌రేష‌న్ దృష్ట్యా దేవీని తీసుకోలేదు. దీంతో నాకు దేవీకి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని అందుకే దేవీని సైడ్ చేసాడు త్రివిక్ర‌మ్ అంటూ వార్త‌లు, రూమ‌ర్లు చాలానే వ‌చ్చాయి. అందులో నిజం లేదు. నాకు దేవీకి మధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్ధ‌లు లేవు.” అని స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus