Manchu Lakshmi: ఇకపై సినిమాలను ప్రొడ్యూస్ చేయను: మంచు లక్ష్మి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి మంచు వారసులుగా ఇండస్ట్రీలోకి విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఈమె మంచు వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో టాక్ షోలు వెబ్ సిరీస్ , సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఇప్పటివరకు మంచు లక్ష్మి నటించిన సినిమాలు తనకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. ఇక సినిమాల పరంగా పక్కన ఉంచితే మంచు కుటుంబం నిత్యం ఏదో ఒక విషయం ద్వారా నెటిజన్ ల ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారు.

ఇలా ట్రోలింగ్ గురవడంలో మంచు కుటుంబం ముందు వరుసలో ఉంటుంది.ఇప్పటివరకు మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇకపోతే మంచు లక్ష్మి చిన్నప్పటినుంచి అమెరికాలో పెరగడం వల్ల ఈమె భాష కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అయితే ఈమె భాషకు కూడా ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అయితే కొందరు ఈమె భాషను ఇష్టపడగా మరికొందరు ఈమె మాట్లాడే మాట తీరును పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి తనకు తెలుగు చదవడం అసలు రాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా ఈమె తెలుగు రాదని చెప్పేసరికి పెద్ద ఎత్తున నెటిజన్లు ఈమె పై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు నేర్చుకునే స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడే పుట్టిన ఈమెకు తెలుగు రాకపోవడం,రాదని చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక సినిమాల గురించి ఈమె మాట్లాడుతూ ఇకపై తాను సినిమాలకు ప్రొడ్యూస్ చేయకూడదని భావించాను కేవలం వెబ్ సిరీస్లను మాత్రమే నిర్మించాలని వెబ్ సిరీస్ అయితే నాకు ఇష్టం వచ్చిన విధంగా నాకు వీలున్నప్పుడు నటించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మంచు లక్ష్మీ వెల్లడించారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus