విజయ్ దేవరకొండ పై మళ్ళీ ట్రోలింగ్.. కారణం అదే..?

  • June 8, 2019 / 03:14 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పెళ్ళి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’టాక్సీవాలా’ వంటి చిత్రాలతో అతి తక్కువ టైంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ముక్కు సూటిగా మాట్లాడుతూ.. తన పైన వచ్చే మీమ్స్ ను కూడా ఎంజాయ్ చేస్తుంటాడు విజయ్ దేవరకొండ. అటువంటి విజయ్ దేవరకొండ ను ఇప్పుడు మరోసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనికి అసలు కారణం ‘దొరసాని’ సినిమా. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండే ఈ ‘దొరసాని’ చిత్రంలో హీరో. తనకి ఇదే మొదటి చిత్రం. తాజా ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్ ను కూడా విడుదల చేసారు.

అయితే ఇందులో ట్రోల్ చేయడానికేముంది అనేగా మీ డౌట్. విషయం ఏంటంటే ‘దొరసాని’ టీజర్ గురించి విజయ్ దేవరకొండ స్పందించలేదు. కానీ అటు తరువాత విడుదల చేసిన ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ట్రైలర్ పై మాత్రం విజయ్ దేవరకొండ వెంటనే స్పందించాడు. ఈ ట్రైలర్ పై ప్రసంసలు కురిపించాడు. కానీ తమ్ముడి సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు. ‘తమ్ముడు సినిమాను వదిలేసి.. వేరే వారి సినిమాను మోసే పనులేంటి’ అంటూ అయన ఫ్యాన్సి ఆయనకి క్లాస్ పీకుతున్నారు. మరి ఈ విషయం పై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus