వినాయక చవితికి భలే వింతగా పోటీ పడుతున్నారు

“ఏం మాయ చేసావే” సినిమాతో సమంత తెలుగు తెరకు పరిచయమైన విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే సినిమాతో సుధీర్ బాబు సమంతకు అన్నయ్యగా పరిచయమైన విషయం మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. ఈ ఇద్దరూ సెప్టెంబర్ 13న తమ తాజా చిత్రాలు “యూ టర్న్, నన్ను దోచుకుందువటే” విడుదల చేయడానికి సన్నద్ధమై తెలియకుండానే పోటీ పడ్డారు. అయితే.. ఒకటి థ్రిల్లర్, మరొకటి రోమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో.. ఏమాత్రం బాగున్నయ రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించడం ఖాయం అనుకొన్నారు. ఈ విషయమై సుధీర్ బాబు-సమంతలు కూడా ఆనందం వ్యక్తం చేశారు.

కట్ చేస్తే.. ఇప్పుడు ఈ జెర్రీ-జెస్సీల ఫైట్ లోకి కార్తీక్ అలియాస్ నాగచైతన్య కూడా వచ్చి చేరాడు. నిజానికి ఆగస్ట్ 31న విడుదలవ్వాల్సిన నాగచైతన్య “శైలజారెడ్డి అల్లుడు” కూడా కారణాంతరాల వలన సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. సో, సెప్టెంబర్ 13న వినాయక చవితికి “ఏం మాయ చేసావే” చిత్రంలో కలిసి నటించిన నాగచైతన్య-సమంత-సుధీర్ బాబులు వేరు వేరు సినిమాలతో పోటీపడనున్నారన్నమాట. మరి మొగుడు-పెళ్ళాల మధ్యలో పోటీ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus