Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Advertisement

టాలీవుడ్‌లో సినిమాల ప్రమోషన్స్ పూర్తిగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి హీరోలు విభిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా యువ నటుడు నందు కూడా తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ugly Story

ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా, ముఖ్యమైన పాత్రల్లో నటించిన నందు. తనకు సరైన బ్రేక్ ఇచ్చే హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఆయన ‘అగ్లీ స్టోరీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఉయ్యాలజంపాల ఫేమ్ అవికా గోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 22న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం నందు ఎంచుకున్న విధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. సాధారణ ప్రమోషన్స్‌కు భిన్నంగా, ఆయన డెలివరీ బాయ్ అవతారం ఎత్తి నగర వీధుల్లో కనిపించారు. ఫుడ్ డెలివరీ బ్యాగ్ వేసుకుని బైక్‌పై తిరుగుతూ, సినిమా రిలీజ్ డేట్ ఉన్న పాంప్లెట్స్‌ను ప్రజలకు పంచుతూ కనిపించారు. మొదట ఆయనను చూసిన వారు నిజంగానే డెలివరీ బాయ్ అనుకున్నారు. కానీ దగ్గరగా చూసి హీరో నందు అని గుర్తించిన తర్వాత ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు కూడా నందు డెడికేషన్‌ను ప్రశంసిస్తున్నారు. సినిమా కోసం ఇలా గ్రౌండ్ లెవెల్‌లోకి వచ్చి ప్రమోషన్ చేయడం మంచి ప్రయత్నమని కామెంట్లు చేస్తున్నారు. ఇక అవికా గోర్ విషయానికి వస్తే, ఉయ్యాలజంపాల చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, తర్వాత సినిమాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ‘అగ్లీ స్టోరీ’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

మొత్తానికి, నందు చేసిన ఈ వినూత్న ప్రమోషన్ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈనెల 22న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus