Ugram Collections: ప్లాప్ గా మిగిలిన ‘ఉగ్రం’.!

  • May 27, 2023 / 09:13 PM IST

‘నాంది’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన అల్లరి నరేష్.. ఆ తర్వాత ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా కూడా చేశాడు. అది మంచి సినిమా అనిపించుకుంది కానీ మంచి సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ అనే చిత్రం చేశాడు. ఇది పక్కా యాక్షన్ మూవీ. మే 5న ఈ చిత్రం విడుదల అయ్యింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్‌ ప్రేక్షకులకు మరో కొత్త అల్లరి నరేష్ ను పరిచయం చేసిందని చెప్పాలి. అయితే రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ విషయంలో జస్ట్ యావరేజ్ అనిపించుకుంది.తర్వాత చేతులెత్తేసింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.00 cr
సీడెడ్ 0.42 cr
ఉత్తరాంధ్ర 0.39 cr
ఈస్ట్ 0.25 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.22 cr
కృష్ణా 0.24 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.18 cr
ఓవర్సీస్ 0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.16 cr (షేర్)

‘ఉగ్రం’ (Ugram) చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.3.16 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.1.84 కోట్ల నష్టాలతో ప్లాప్ గా మిగిలింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus