జై లవ కుశ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించడానికి అంగీకరించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే అప్పటి నుంచి ఈ సినిమా గురించి అధికారిక అప్డేట్ రాలేదు. హీరోయిన్ గా అను ఇమ్యానుయేల్, సంగీత దర్శకుడిగా అనిరుధ్ అని ముందుగా అనుకున్న త్రివిక్రమ్ అజ్ఞాతవాసి దెబ్బకి వారిని తొలగించి.. వేరే వాళ్ళని సెలక్ట్ చేశారు. వారు ఈ చిత్రానికి సైన్ చేయడంతో నేడు అధికారికంగా వెల్లడించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన ఇద్దరు భామలు రొమాన్స్ చేయనున్నారు.
సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ఇందులోనూ ప్రధాన హీరోయిన్ గా ఎంపికైంది. ఆమెతో పాటు డీజే పాప పూజా హెగ్డే ఎన్టీఆర్ తో కలసి హంగామా చేయనుంది. ఇక సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ థమన్ ఫిక్స్ అయ్యారు. కొత్త కొత్త స్వరాలతో యువతని ఉర్రూతలూగిస్తున్న థమన్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రివిక్రమ్ తో చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు.