Aatma Bandhuvu: అరవై ఏళ్ల ‘ఆత్మబంధువు’ గురించి ఆశ్చర్యకరమైన విశేషాలు..!

  • December 14, 2022 / 03:31 PM IST

‘విశ్వవిఖ్యాత, నటరత్న’, ఎన్టీఆర్, ‘విశ్వ నట చక్రవర్తి’ ఎస్వీఆర్, ‘మహానటి’ సావిత్రిల కలయికలో పలు అపురూపమైన చిత్రాలు వచ్చాయి.. నటనలో ముగ్గురూ ముగ్గురే.. వారు కలిసి ఒకే ఫ్రేములో కనిపిస్తే చూడ్డానికి రెండు కళ్లు చాలవు అనిపిస్తుంది.. ఈ ముగ్గురు మహానటులు కలిసి నటించిన వాటిలో అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘ఆత్మబంధువు’ కూడా ఒకటి.. 1962 డిసెంబర్ 14న విడుదలై అఖండ విజయం సాధించింది.. 2022 డిసెంబర్ 14 నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.. ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం..

విలక్షణ నటి భానుమతి భర్త పి.ఎస్. రామకృష్ణ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. సారథి స్టూడియోస్ బ్యానర్ మీద వై.రామకృష్ణ ప్రసాద్, సి.వి.ఆర్. ప్రసాద్ నిర్మించారు. జూనియర్ సముద్రాల మాటలు, సినారె, కొసరాజు, శ్రీశ్రీ మరియు సముద్రాల పాటలు రాయగా.. కె.వి.మహదేవన్ సంగీతమందించారు.. ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, కె.జమునా రాణి తదిరులు పాడారు..

కథ…

రావ్ బహద్దూర్ చంద్రశేఖరం, పార్వతి దంపతుల (ఎస్వీఆర్ – కన్నాంబ) షష్టిపూర్తితో సినిమా ప్రారంభమవుతుంది.. వారికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానం.. పెద్ద కూతురు మంగళాంబ (సూర్యకాంతం), ఐదోతనానికి దూరమై.. కొడుకు (రాజబాబు)తో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.. చంద్రశేఖరం ఇద్దరు కొడుకులు కూడా భార్య బిడ్డలతో సహా వారితోనే కలిసి ఉంటారు.. చిన్నకొడుకు రఘ, చిన్న కుమార్తె గీత పెళ్లీడుకి వచ్చి ఉంటారు.. చంద్రశేఖరం, పార్వతి దంపతులు అనాథ అయిన రంగ (ఎన్టీఆర్) ని పెంచుకుంటారు.. వారిని అత్త, మామలుగా పిలుస్తూ.. వారంటే ఎనలేని భక్తి, మర్యాదలతో ఉంటాడు రంగ.. చంద్రశేఖరం పిల్లలు అతడిని చులకనగా చూస్తున్నాపట్టించుకోడు.. పార్వతి ఈ విషయంలో బాధపడుతుంటుంది..

పార్వతి.. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రభావతి కూతురు లక్ష్మీ (సావిత్రి) ని చిన్న కొడుకు రఘుకిచ్చి చెయ్యాలనుకుంటుంది.. కానీ అప్పటికే రఘు, జానకిని ప్రేమిస్తుంటాడు.. లక్ష్మీతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. ఆమెను రంగకిచ్చి వివాహం జరిపిస్తారు.. చంద్రశేఖరం షష్టిపూర్తికి వచ్చిన ఓ ధనవంతుడు గీతని తన కొడుక్కి చేసుకోవాలనకుంటాడు.. సంబంధం కుదురుతుంది.. పెళ్లి సమయానికి చంద్రశేఖరం నష్టాలు పాలు కావడంతో, మగ పెళ్లి వారు ఆ సంబంధం వద్దనుకుని వెళ్లిపోతారు.

అక్కడి నుండి ఆర్థిక, కుటుంబ కష్టాలు మరింత ఎక్కువవుతాయి.. ఎలాగైనా రంగను బయటకు పంపించేస్తే ప్రయోజకుడవుతాడని బలవంతంగా ఇంటినుండి పంపించి వేస్తాడు చంద్రశేఖరం.. తర్వాత కొడుకులు, కోడళ్ల సూటిపోటి మాటలు భరించలేక చంద్రశేఖరం కన్నుమూస్తాడు.. ఇంటినుండి బయటకొచ్చిన రంగకు అప్పుడే అసలు ప్రపంచమేంటనేది తెలుస్తుంది.. ఆ తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాలే ఈ ‘ఆత్మబంధువు’ కథ..

విశేషాలు…

ఎస్వీఆర్ రెండో కొడుకు శ్రీధర్‌గా నటించింది.. ‘శంకరాభరణం’ వంటి కళాత్మకమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత, పూర్ణోదయా పిక్చర్స్ అధినేత ఏడిద నాగేశ్వర రావు..

‘ఆత్మబంధువు’ అనగానే మొట్టమొదటగా గుర్తొచ్చే పాట.. ‘ఒక రాజు.. ఒక రాణి’.. అలాగే ‘చదువు రాని వాడవని దిగులు చెందకు’, ‘మారదు మారదు’, ‘చీరకట్టి సింగారించి’ వంటి పాటలన్నీ ఆబాలగోపాలాన్ని అలరించాయి..

భాగ్యనగరంలో శ్రీ సారథి స్టూడియోస్ నెలకొల్పిన సారథి సంస్థ ఎన్టీఆర్‌తో రెండు సూపర్ హిట్ సినిమాలు రూపొందించింది.. ఈ రెండు కూడా తమిళంలో శివాజీ గణేషన్ నటించిన చిత్రాలకు రీమేక్ కావడం విశేషం..

మొదటిది ‘కలసి ఉంటే కలదు సుఖం’ , రెండవది ‘ఆత్మబంధువు’.. రెండిట్లోనూ సావిత్రి కథానాయికగా నటించడం.. కె.వి.మహదేవన్ సంగీతమందించడం విశేషం.. ‘కలసి ఉంటే కలదు సుఖం’ ఒరిజినల్ (భాగ పిరివినై), ‘ఆత్మబంధువు’ తమిళ్ మాతృక (పడిక్కాద మేధై) రెండిటికీ.. ఏ.భీమ్ సింగ్ దర్శకత్వం వహించారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus