‘భోళా శంకర్’ సినిమా నుండి ‘మిల్కీ బ్యూటీ…’ అంటూ ఇటీవల ఓ పాట వచ్చింది. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పాటను ఇప్పుడూ లూప్‌లో పెట్టుకుని మరి వినేస్తారు శ్రోతలు. చిరంజీవి ఫ్యాన్స్ అయితే చిరు గ్రేస్ స్టెప్పులను చూసి మురిసిపోతున్నారు. ఈ పాటలో ఫిమేల్ వాయిస్ సూపర్ ఉంది ఎవరా సింగర్ అని వెతుకుతున్నవాళ్లు కూడా ఉన్నారు. వారి కోసమే ఈ కథనం. ఆ పాటలో ఫిమేల్ వాయిస్ సంజన కల్మంజీది. పేరు విని ఎవరీ కొత్తామె అనుకునేరు.
సౌత్‌లో ఈ పేరు, వాయిస్ కొంతమందికి పరిచయమే. అవును. తెలుగు, తమిళం, కన్నడలో సంజన ఇప్పటికే పాటలు పాడారు. అన్నింటికి మించి ఈమె మహతి స్వరసాగర్ భార్య. అవును మీరు చదివింది కరెక్టే.. ఆమె మణిశర్మ కోడలు. 2021లో సంజనను మహతి స్వర సాగర్ వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి పాటలు పాడుతున్నా.. మహతి మ్యూజిక్‌లో చిరంజీవి సినిమాకు పాడటంతో డిస్కషన్‌లోకి వచ్చారు.
కర్ణాటకలో పుట్టిన సంజన కల్‌మంజీ.. చెన్నైలో చదువుకున్నారు. ఆ రోజుల్లోనే సంగీతం మీద ఆసక్తితో నేర్చుకుని స్కూలు, కాలేజీలో స్టేజీపై పాటలు పాడారు. ఈ క్రమంలో ‘సూపర్ సింగర్ జూనియర్ 2’ ప్రోగ్రామ్‌లో పాల్గొని ట్రోఫీని గెలుచుకున్నారు. ‘కవాల్’ అనే మాలయాళ సినిమాతో 2015లో సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు సంజన. ఆ తర్వాత ‘డిక్టేటర్’, ‘జూమ్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కృష్ణ వ్రింద విహారి’, ‘లవ్ టుడే’, ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాల్లో పాటలు పాడారు.
సంజన (Singer) పాటలు పాడటంలో ఎంత ఎంజాయ్ చేస్తారో, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్‌తో సందడి చేస్తూ అంతే హుషారుగా ఉంటారు. రీల్స్ వీడియోలతో ఆమె సోషల్ మీడియా ఎప్పుడూ బిజీనే. వర్షంలో పాటు పాడుతూ సంజన ఆడిపాడే వీడియోలు సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తాయి. వాటికితోడు ట్రిప్పుల ఫొటోలు, వీడియోలు కూడా కనిపిస్తాయి. కావాలంటే మీరు కూడా ఆమె ప్రొఫైల్ ఓపెన్ చేసి ఓ లుక్కేద్దురు.