Vasanthi Krishnan: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ వసంతీ కృష్ణన్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

‘బిగ్ బాస్ 6’ కూడా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. గత 3 సీజన్లకులాగే ఈ సీజన్ ను కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఈ సీజన్లో 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.వాళ్లలో చాలా మంది మొహాలు ప్రేక్షకులకు తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. వీరిలో వసంతీ కృష్ణన్ కూడా ఒకరు. ఈమె హౌస్ లోకి 13వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతానికి కామ్ గానే హౌస్ లో కొనసాగుతుంది. అయితే ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) వసంతీ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో పుట్టి పెరిగింది. ఈమె విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది.

2) చదువు పూర్తయ్యాక ఉద్యోగం రీత్యా బెంగళూరుకి వెళ్ళింది. తర్వాత అక్కడే కొన్నాళ్ళు సెటిల్ అయ్యింది.

3) కొన్నాళ్ల తర్వాత వసంతీ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. తర్వాత రెండు, మూడు కన్నడ సినిమాల్లో నటించింది. కానీ అవేవి సక్సెస్ కాలేదు.

4) 2019 లో ఈమె తెలుగు సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. ‘సిరి సిరి మువ్వలు’ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అలాగే ‘గోరింటాకు’ ‘గుప్పెడంత మనసు’ సీరియల్స్ లో కూడా నటించింది.

5) 2021 లో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘క్యాలీ ఫ్లవర్’ మూవీలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది వచ్చిన ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీలో కూడా ఈమె నటించింది.

6) ఈమె తండ్రి కృష్ణన్ దురదృష్టవశాత్తు మరణించినట్టు ఈమె హౌస్ లో ఎంట్రీ ఇచ్చే ముందు చెప్పుకొచ్చింది. అందువల్ల ఈమె పై సింపతీ బాగా క్రియేట్ అయ్యిందని చెప్పాలి. ఈమె తండ్రి పై ఇష్టంతోనే ఆయన పేరుని తన పక్కన జోడించింది ఈ అమ్మడు.

7) ఈమెకు డాన్సింగ్ మరియు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే ఆమె వీటికే ప్రిఫరెన్స్ ఇస్తుంది.

8) గతంలో ఈమె ఓ అబ్బాయితో డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అతను ఈమె తోటి నటుడు అనే ప్రచారం కూడా నడిచింది. కానీ ఇప్పట్లో ప్రేమ, పెళ్లి అనే పాదాలకు ఈమె లైఫ్ లో చోటు లేదని ఈమె క్లారిటీ ఇచ్చింది.

9) ప్రస్తుతం ఈమె చేతిలో ఒకటి, రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే పలు వెబ్ సిరీస్ లకు కూడా ఈమె సైన్ చేసింది.

10) ఈమె సోషల్ మీడియా ఖాతాకి 66 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం తన గ్లామర్ ఫొటోలతో తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ అమ్మడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus