Vadde Naveen: హీరో వడ్డే నవీన్ గురించి మనకు తెలియని విషయాలు..!

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడిగా సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్.1997 వ సంవత్సరంలో ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ‘కోరుకున్న ప్రియుడు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు వడ్డే నవీన్. ఆ చిత్రం హిట్ అవ్వడంతో ఇతను లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా దగ్గరయ్యాడు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘పెళ్లి’ చిత్రం ఇతనికి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత ‘స్నేహితులు’ ‘మానసిచ్చి చూడు’ ‘చాలా బాగుంది’ ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. ఇతను సీనియర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ అల్లుడు అన్న సంగతి తెలిసిందే. రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు నవీన్. కానీ వీళ్ళు కొన్ని కారణాల వలన విడిపోయారు. ఇదిలా ఉండగా.. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకుంటే నవీన్ కనుమరుగు అయిపోయాడు. ప్రస్తుతం ఇతను ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు అనే విషయాలు చాలా మందికి తెలీదు.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘ఎటాక్’ లో ఇతను నటించాడు. కానీ నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఆ చిత్రం పెద్ద బూస్టప్ ను ఇవ్వలేదు. దాంతో అతను తన ఫ్యామిలీ బిజినెస్ లను చూసుకుంటున్నాడు. తనకి సూట్ అవుతుంది అనే పాత్రలు దొరికితే కచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తానని ఇతను చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus