ఒకప్పుడు ఈమెను ఐరన్ లెగ్ అన్నారు కానీ ఇప్పుడు ‘నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు’ అంటూ ఈమె కాళ్ళ పైనే పాట రాయించుకునే రేంజ్ కు ఎదిగింది. ఎవరి గురించి చెబుతున్నానో ఈ పాటికే మీకు అర్ధమైపోయుంటుంది కదా.యెస్.. మన పూజా హెగ్డే గురించే..! ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజా హెగ్డే.ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ అలాగే అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి క్రేజీ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే బాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఈ ‘బుట్ట బొమ్మ’ పుట్టినరోజు. కాబట్టి ఈమె గురించి ఇప్పటి వరకూ మనకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి :
పూజా హెగ్డే పుట్టి, పెరిగింది అంతా ముంబైలోనే .! అయితే ఈమె తల్లిదండ్రులు మంజునాథ్ మరియు లతా హెగ్డేలు.. కర్ణాటకు చెందిన మంగుళూరు వాస్తవ్యులు.నిజానికి హీరోయిన్ కావాలన్న ఉద్దేశం పూజా హెగ్డే కు లేదట. ఎందుకంటే ఈమె కుటుంబానికీ … సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదు. పూజా తండ్రి మంజునాథ్ ఓ క్రిమినల్ లాయర్. కానీ, అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో పనిచేసేవారట. ఇక పూజా అమ్మ లత ఎంబీఏ చదువుకున్నారు. ఇక ఆమె అన్నయ్య రిషభ్ ఓ డాక్టర్. దాంతో పూజాకు సినిమాల పై ఇంట్రెస్ట్ ఉండేది కాదట.
పూజా మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది.అటు తర్వాత మోడలింగ్ చేసే అవకాశాలు కూడా వచ్చాయట. అప్పుడే సినిమాల వైపు అడుగులు వేసినట్టు తెలుస్తుంది.పూజా హెగ్డే మొదట ‘ముగామూడీ’(తెలుగులో ‘మాస్క్’) అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగులో ‘ఒక లైలా కోసం’ చిత్రం చేసే అవకాశం దక్కించుకుందట.
అంతేకాదు అదే టైంలో రణ్‌బీర్‌తో పూజా హెగ్డే చేసిన ఓ యాడ్‌ను అశుతోష్ భార్య చూశారట. దాంతో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘మహోంజదారో’ చిత్రంలో పూజకు ఛాన్స్ దక్కింది.
పూజా హెగ్డే హీరోయిన్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు..మొదట ఈమె తల్లికి చెప్పిందట. ఆమె ఎంతో సహకరించిందని తెలుస్తుంది. పూజా హెగ్డేకు ఆమె తల్లి ఎంకరేజ్మెంట్ ఎంతో ఉందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది కూడా..!
‘కొన్ని సినిమాలు చేసి.. ఎంతో కొంత సంపాదించుకుని వెళ్ళిపోదాం’ అనే ఉద్దేశంతో పూజా ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదట . నటిగా రాణించాలి అనే ఉద్దేశంతోనే అడుగుపెట్టిందట.
‘మహోంజదారో’ భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఈమె 2ఏళ్ళు డేట్స్ ఇచ్చిందట. ఈ కారణంగా మరో సినిమా చెయ్యలేకపోయిందట.అయితే ఈమె చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి.. ఈమెకు అవకాశాలు రాలేదని మొదట అందరూ కామెంట్స్ చేసేవారట. అయినా ఈమె బాధపడలేదు.ఫలితంగా వరుసగా పెద్ద సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంది.
‘రంగస్థలం’ చిత్రంలో ‘జిగేలు రాణి’ వంటి ఐటెం సాంగ్ కు ప్రాముఖ్యత ఉంది కాబట్టే.. . ఆ పాటలో పూజా నర్తించడానికి ఒప్పుకుందట.
యోగాలు, వర్కౌట్లు వంటివి చెయ్యడానికి పూజా అధిక ప్రాధాన్యత ఇస్తుందట. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని పూజ తెలిపింది. షూటింగ్లో ఉన్నప్పటికీ ఈమె యోగా చెయ్యడం మానదట.
డైటింగ్ వంటివి చెయ్యడం కూడా పూజకు నచ్చవట. అయితే కొవ్వు పట్టేసే పదార్ధాలకు మాత్రం దూరంగా ఉంటుంది.ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న పదార్ధాలను కూడా తీసుకుంటూ ఉంటుంది పూజా.
కథ డిమాండ్ చేస్తేనే గ్లామర్ రోల్స్ చేస్తానంటుంది పూజా. అనవసరంగా గ్లామర్ డోస్ పెంచాలనే ఉద్దేశం ఆమెకు ఉండదని తెలిపింది.
ఇప్పట్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అయితే చెయ్యదట పూజా హెగ్డే. అలాంటి సీరియస్ రోల్స్ చెయ్యడం అస్సలు ఇష్టం ఉండదట.ప్రస్తుతానికి కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తుందట. అలా అని ప్రాముఖ్యత లేని సినిమాలు అయితే చెయ్యను అంటుంది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60