Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » 38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

  • March 4, 2026 / 06:32 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

1987… మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో స్టార్ డమ్ అనుభవిస్తున్న రోజులవి. వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. అందులో 90 శాతం బ్లాక్ బస్టర్లు కొడుతున్నాయి. పారితోషికాల లెక్కలకి కొధవ లేదు. కానీ ఏదో అసంతృప్తి.

38 Years For Rudraveena

తనలో ఉన్న నటుడుని సంతృప్తి పరిచే సినిమాలు చేయడం లేదే అని…! ఈ తరుణంలో చిరుకి ‘మరో చరిత్ర’ వంటి గొప్ప సినిమా అందించిన కె.బాలచందర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఆశపడ్డారు..! బాలచందర్ కూడా చిరు పిలుపు కోసం ఎదురుచూస్తున్న రోజులవి..! చిరు ఫోన్ చేసి మాట్లాడిన వెంటనే బాలచందర్ వెళ్లి.. కథ చెప్పారు. కానీ తెలుగు నేటివిటీ మిస్ అవుతుందేమో అనిపించింది.

Unknown facts about Rudraveena movie

కొన్ని నవలలని బాలచందర్ గారికి రిఫరెన్సులుగా ఇచ్చి.. కథని డెవలప్ చేయమన్నారు. అలా ‘రుద్రవీణ'(Rudraveena) కథ తయారైంది. అంతా బాగానే ఉంది.. కానీ చిరంజీవితో ఇలాంటి సినిమా తీసేందుకు అప్పటి నిర్మాతలు సంకోచించారు. చిరు కూడా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే మనిషి కాదు. దీంతో ‘అంజనా ప్రొడక్షన్స్’ అనే సంస్థని స్థాపించి సోదరుడు నాగబాబుకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.

జెమినీ గణేషన్ వంటి స్టార్ ని తీసుకొచ్చారు. ఈ సినిమాకి గాను ఆయన హీరోతో సమానంగా పారితోషికం డిమాండ్ చేశారు. చిరు, నాగబాబు కూడా తగ్గలేదు. తండ్రి పాత్ర ఆయనైతేనే బాగుంటుందని జెమినీ గణేశన్ అడిగినంత పారితోషికం ఇచ్చి ఒప్పించారు.

‘రుద్రవీణ’ షూటింగ్ ప్రధానంగా తమిళనాడులోని కోర్తాళం పరిసర ప్రాంతాల్లో జరిపారు. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ అలాగే పచ్చని ప్రకృతి మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అంతేకాకుండా కంచి, శ్రీనగర్,చెన్నై(అప్పుడు మద్రాస్) వంటి ప్రాంతాల్లో కూడా కొంత భాగం షూటింగ్ జరిపారు.చాలా వరకు రియల్ లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరణ జరగడం ఒక విశేషంగా చెప్పుకోవాలి.

‘రుద్రవీణ’ షూటింగ్ 70 రోజుల పాటు జరిగింది. ఆ రోజుల్లో చాలా వర్కింగ్ డేస్ అవి. ఎటువంటి సెట్స్ వేయకుండానే షూటింగ్ కి అంత టైం పట్టింది.

ఇక బడ్జెట్ విషయానికి వస్తే.. ‘రుద్రవీణ’ చిత్రాన్ని ఆ రోజుల్లోనే రూ.80 లక్షల బడ్జెట్ తో తీశారు. ఇప్పటి రోజులని బట్టి లెక్క వందల కోట్లు దాటుతుంది అనడంలో సందేహం లేదు.

1988 మార్చి 4న ‘రుద్రవీణ’ రిలీజ్ అయ్యింది. సినిమాకి హిట్ టాక్ వచ్చింది. అప్పటి క్రిటిక్స్ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు. కానీ మాస్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా రుచించలేదు. చిరు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ధియేటర్ కి వెళ్లడం వల్లే .. ఈ సినిమా వారికి నచ్చలేదు అనుకోవచ్చు. ఆర్థికంగా ఈ సినిమా నాగబాబుకి నష్టాలు మిగల్చడానికి అదొక కారణం.

మరోపక్క ‘రుద్రవీణ’ సినిమా కాంట్రోవర్సీకి కూడా గురైంది. తన ‘జనం మనం’ చిత్రం కథని యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టారని, 13 రీళ్ళ వరకు 2 సినిమాలు ఒకేలా ఉన్నాయని దర్శకుడు మాదాల రంగారావు ప్రెస్ మీట్ పెట్టి మరీ పెద్ద రచ్చ చేశారు. తర్వాత చిరంజీవి పై ఉన్న గౌరవంతో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నట్టు అప్పట్లో టాక్ నడిచింది.

వాటిని పక్కన పెట్టేస్తే.. ‘రుద్రవీణ’ లో సూర్యం పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు అనే చెప్పాలి. తర్వాత తమిళంలో ఈ సినిమాని కమల్ హాసన్ తో రీమేక్ చేశారు. అందులోని కొన్ని ఎపిసోడ్స్ చూస్తే.. మన మెగాస్టారే అద్భుతంగా చేశారు కదా.. అని మన ప్రేక్షకులు అనుకున్నా తప్పులేదు. అంత ఇన్వాల్వ్ అయ్యి చిరు ‘రుద్రవీణ’ లో నటించారు.

హీరోయిన్ శోభన కూడా లలిత శివజ్యోతి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆమె లుక్స్, కట్టు బొట్టు అందరినీ ఆకట్టుకున్నాయి.

శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో సాగే కథ ఇది. కాబట్టి.. మ్యూజిక్ విషయంలో కూడా బాలచందర్ చాలా శ్రద్ద వహించారు. ఇళయరాజా ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ‘లలిత ప్రియ కమలం’ ‘తరలిరాధ..’ ‘నమ్మకు నమ్మకు’ ‘నేను సైతం’ వంటి పాటలు చాలా బాగుంటాయి.

ముఖ్యంగా ‘నేను సైతం’ అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరంజీవికి ఈ పాట చాలా బాగా నచ్చిందట. ఈ పాట చిత్రీకరణ టైంలో ఆయనకి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే కోరిక పుట్టిందట.ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. 2003 లో వచ్చిన ‘ఠాగూర్’ సినిమాలో కూడా ‘నేను సైతం’ పాటని రీమిక్స్ చేయించుకుని మరీ పెట్టుకున్నారు చిరు. దానిని బట్టి.. చిరుని ఆ పాట ఎంతలా కదిలించిందో అర్ధం చేసుకోవచ్చు.

కమర్షియల్ లెక్కలు పక్కన పెట్టేస్తే… అవార్డుల విషయంలో ‘రుద్రవీణ’ సత్తా ఛాటింది. 4 జాతీయ పురస్కారాలను అందుకుంది ఈ సినిమా. అలాగే రష్యన్ ఫిల్మ్ ఫెస్టివల్స లో పాల్గొన్న చిత్రంగా, ఆస్కార్ ఎంట్రీ పొందిన తొలి సౌత్ సినిమాగా ‘రుద్రవీణ’ చరిత్ర సృష్టించింది.

‘మానవ సేవే మాధవ సేవ’ ‘మద్యపానం వల్ల జరిగే అనర్థాలు’ వంటి గొప్ప అంశాలని కూడా ‘రుద్రవీణ’లో దర్శకులు బాలచందర్ ప్రస్తావించడం జరిగింది. గొప్ప విలువలు కలిగిన సినిమాగా ‘రుద్రవీణ’ ఎప్పటికీ నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.

నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #38 years for rudraveena
  • #Balachandar
  • #Chiranjeevi
  • #rudraveena
  • #shobhana

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

6 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

5 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

9 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

10 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

11 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version