Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

రామ్‌చరణ్‌ గురించి నాకు అంతా తెలుసు అనుకునేవారికి కూడా ఇందులో కొన్ని విషయాలు ‘అవునా చేశాడా?’ అనే డౌట్‌ కలిగిస్తాయి. ఎందుకంటే చరణ్‌కి సంబంధించిన ఈ విషయాల గురించి పెద్దగా ఎక్కడ చర్చ జరగదు కాబట్టి. అలాగే మరికొన్ని విషయాలు కొన్ని ఏళ్ల క్రితంవి కాబట్టి. నేడు పెద్ది పహిల్వాన్‌ అలియాస్‌ రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ కొన్ని అంశాల గురించి ఓ సారి చూద్దామా.

Ram Charan

* రామ్‌చరణ్‌ ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. అవే ‘మగధీర’, ‘నాయక్‌’, ‘ఎవడు’, ‘గేమ్‌ ఛేంజర్‌’.
* రామ్‌చరణ్‌కి గుర్రాలు అన్నా, గుర్రపు స్వారీ అన్నా ఇష్టం. హైదరాబాద్‌ పోలో, హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌ పార్టనర్‌ కూడా.
* రామ్‌ చరణ్‌ తన సొంత పేరుతో మూడు సినిమాల్లో నటించాడు. తొలి సినిమా ‘చిరుత’, ఆ తర్వాత ‘ఎవడు’, ‘నాయక్‌’లో చరణ్‌ అని పిలిపించుకున్నాడు.
* చరణ్‌ నటించిన ఏకైక హిందీ సినిమా ‘జంజీర్‌’.. తెలుగు వెర్షన్‌లో ‘ముంబయి కే హీరో..’ ఆనే పాట కోసం గొంతు సవరించుకున్నాడు.


* ఇప్పటివరకు రామ్‌ చరణ్‌ రెండు సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించాడు. ఒకటి చిరంజీవి ‘ఖైదీ నెం 150’, మరొకటి సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. ఈ రెండింటిలోనూ పాటలో వచ్చి స్టెప్పేసి వెళ్లాడు.
* సల్మాన్‌ ఖాన్‌ సినిమా ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌కి హీరో పాత్రకు చరణ్‌ డబ్బింగ్‌ చెప్పాడు.
* స్ట్రీట్‌ క్రికెటర్లకు స్టార్‌ క్రికెటర్లు చేద్దాం అంటూ ఏర్పాటైన ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో హైదరాబాద్ జట్టుకు ఓనర్‌ చరణ్‌.
* ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో చరణ్‌ విదేశాల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు. జపాన్‌కి చెందిన ఓ బిస్కెట్ల కంపెనీ చరణ్‌ ఫొటోను ప్యాకెట్లపై ముద్రించింది.
* కొణిదెల ప్రొడక్షన్స్‌ అనే బ్యానర్‌ పెట్టి చిరంజీవితో సినిమాలు చేసిన చరణ్‌.. విమెగా పిక్చర్స్‌ అనే మరో బ్యానర్‌ కూడా పెట్టాడు. నిఖిల్‌ హీరోగా ‘ఇండియన్‌ హౌస్‌’ అనే సినిమా ఆ బ్యానర్‌లోనే తెరకెక్కుతోంది.

వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus