చిరంజీవి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

  • August 21, 2019 / 05:43 PM IST

కొణిదెల శివశంకర వర ప్రసాద్ చిరంజీవిగా ఎదిగిన వైనం తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. స్వయం కృషితో ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఎంతోమందిని ఆదుకుని ఆపద్బాంధవుడుగా మారాడు. కొన్నేళ్లు సినీ ప్రపపంచాన్ని వదిలి ప్రజల సేవలో నిమగ్నమయ్యాడు. మళ్లీ ఇప్పుడు తెరపైన కనిపించేందుకు సిద్ధమయ్యారు. నేడు(ఆగస్టు 22) మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అయన రీల్ అండ్ రియల్ లైఫ్ లోని కొన్ని సీక్రెట్స్…

నవలా నాయకుడుప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అనేక నవలలకు చిరంజీవి హీరో అయ్యాడు. నవలల ఆధారంగా ఛాలెంజ్, మరణ మృదంగం, అభిలాష, రాక్షసుడు, స్టూవస్టుపురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాలు వచ్చాయి.

సేవకుడుచిరు నెలకొల్పిన బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను రక్షించింది. నేత్ర నిధి ద్వారా మరణించిన దాతల నుంచి సేకరించిన 1,500 పైగా జతల కళ్లతో మూడు వేల మందికి కంటిచూపు రప్పించారు.

హిట్ జోడీచిరంజీవి, విజయ శాంతి హిట్ పెయిర్ గా నిలిచారు. వీరిద్దరూ కలిసినటించిన 18 చిత్రాల్లో మెకానిక్ అల్లుడు తప్ప అన్నీ విజయాన్ని సాధించాయి. చిరుతో కామెడీ పండించగల నటిగా రాధిక పేరు సంపాదించింది. ఈమెతో కలిసి చిరు 18 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఎక్కువ చిత్రాలు చేసిన నటి రాధ. 16 చిత్రాల్లో మెగాస్టార్ తో పోటీగా స్టెప్పులు వేసింది.

వంద రోజుల హీరోమెగాస్టార్ నటించిన సినిమాల్లో 35 (అత్యధిక సంఖ్యలో) హైదరాబాద్ లో నేరుగా వందరోజులు ఆడాయి.

భద్రంగా అమ్మ కానుకఅమ్మ అంజనా దేవి చిరంజీవికి చిన్నప్పుడు చేయించిన బంగారు వాచీని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు.

భోజన ప్రియుడుచిరు అన్ని వంటకాలను చాలా ఇష్టంగా తింటారు. సీ ఫుడ్ అంటే కొంచెం ఎక్కువగా ఇష్టం.

కోటికొక్కడుసినిమాకు కోటి రూపాయల పారితోషికం అందుకున్న తెలుగు తొలి నటుడు చిరంజీవి.

నిజాయితీ పరుడుచిరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడంలో ముందుంటారు.1999 -2000 సంవత్సరానికి 10 లక్షలకు పైగా ఆదాయ పన్ను చెల్లించినందుకు ఆదాయ పన్ను విభాగం వారు చెన్నైలో “ప్రాంతీయ స్థాయి సన్మాన్” తో గౌరవించారు.

కీర్తి కిరీటంఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో చదివిన చిరంజీవి తెలుగు సినీరంగానికి చేసిన సేవలకు గాను అదే విశ్వవిద్యాలయం నుంచి 2006 నవంబర్ లో గౌరవ డాక్టరేట్ పట్టం అందుకున్నారు.

పద్మభూషణ్చిరంజీవి 7 ఫిలిం ఫెర్ అవార్డులు అందుకున్నారు. మూడు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. 2006 లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి పద్మభూషణ్ గౌరవం అందుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus