Balakrishna: ఆహా వారి ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్ కు ముహూర్తం ఫిక్స్..!

  • June 20, 2022 / 01:09 PM IST

‘నందమూరి బాలకృష్ణ ఏంటి? ఓ టాక్ షోకి హోస్ట్ గా చేయడం ఏంటి?’ అని విమర్శించిన వాళ్ళకి… అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళకి ‘అన్ స్టాపబుల్’ మొదటి సీజన్ తో గట్టి సమాధానం చెప్పాడు మన బాలయ్య. ‘ఆహా’ వారు బాలయ్య లోని మరో కొత్త కోణాన్ని బయట పెట్టి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ షో దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి లో 9.7 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. మొదటి సీజన్ లో మోహన్ బాబు,రాజమౌళి,బ్రహ్మానందం, రానా, నాని, మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, రష్మిక, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బోయపాటి శ్రీను,అనిల్ రావిపూడి.. వంటి స్టార్స్ ఈ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ స్టార్స్ తమ చిన్ననాటి ముచ్చట్లు, పర్సనల్ లైఫ్, వారు ఫేస్ చేసిన వివాదాలు వంటి అంశాలపై ఈ సీజన్లో ముచ్చటించారు.

ఇక సీజన్ 2 కి కూడా రంగం సిద్ధమైంది. రెట్టింపు ఉత్సాహంతో బాలయ్య ఈ సీజన్ ను హోస్ట్ చేయబోతున్నారు. ‘మధుర క్షణాలకి ముగింపు ఉండదు కొనసాగింపే’ అంటూ బాలయ్య.. ఇటీవల ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ సీజన్ కు వచ్చినప్పుడు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

అయితే ఎప్పటి నుండీ ప్రారంభం అవుతుంది? అనే విషయాన్ని ఆగస్టు 15న రివీల్ చేస్తారు. మొదటి సీజన్ 10 ఎపిసోడ్లతో జరిగింది. రెండో సీజన్ కు ఎన్ని ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతుంది? గెస్ట్ లు ఎవరు? అనే విషయాల పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!


‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus