ఎంగేజ్మెంట్ ఫోటోతో ఊహించని షాక్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ!

మితిమీరిన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేసే భామలు చాలా మందే ఉన్నారు. అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో స్టార్ లుగా చలామణి అవుతున్న వారు వాళ్ళే..! ఆ లిస్ట్ లో ఉర్ఫీ జావేద్ చేరి చాలా రోజులైంది. నటిగా రాణించాలి అని భావించిన ఈమె కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. లక్నోలో పుట్టి పెరిగిన ఈమె .. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. అవకాశాల కోసం ముంబై వెళ్ళింది.

సినిమాల్లో అయితే ఈమెకు అవకాశాలు రాలేదు కానీ అక్కడి బుల్లితెర పై ఛాన్స్ లు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యింది.పలు సీరియల్స్ లో నటించిన తర్వాత.. బిగ్ బాస్(ఓటీటీ సీజన్) లోకి అడుగుపెట్టి….కొంత గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈమె డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ‘ఈమె బట్టలు వేసుకుంటుంది అనే కంట.. బట్టలు అడ్డుపెట్టుకుంటుంది అనడం కరెక్ట్’ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తుంటున్నారు.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. తాజాగా ఈమె  (Uorfi Javed) సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అనే ప్రచారం ఊపందుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉర్ఫి జావేద్ చెల్లెలు ఉరుసా జావేద్ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఉర్ఫి ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది నిజం అని ఉర్ఫి కానీ ఉరుసా కానీ క్లారిటీగా చెప్పింది లేదు. అలాగే ఉర్ఫికి ఏ అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనేది కూడా రివీల్ కాకుండా.. జాగ్రత్తపడ్డారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus