ఇటీవల సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్ జరిగితే పెద్ద ఎత్తున హాజరై సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సెలబ్రిటీలందరూ కూడా ఒకే చోట కలిస్తే వారి గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు వేసుకునే దుస్తులపై అందరి దృష్టి పడుతూ ఉంటుంది. ఇలా వారు వేసుకున్నటువంటి డ్రెస్సులు ధర ఎంత అంటూ ఆరా తీయడం మొదలు పెడుతూ ఉంటారు. ఇక సెలబ్రిటీలు అన్న తర్వాత ఖరీదైన బ్రాండెడ్ దుస్తులని ఉపయోగిస్తూ ఉంటారు
వీరు వేసుకునే చెప్పులు వాచ్ డ్రెస్సుల కోసం కొన్ని లక్షలు, కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్స్ అందరూ కూడా ఒకే చోట చేరి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ వేడుకలో భాగంగా మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ క్రిస్మస్ వేడుకలలో భాగంగా మెగా కోడలు ఉపాసన లావణ్య త్రిపాఠి అలాగే స్నేహ రెడ్డితో పాటు మహేష్ బాబు భార్య నమ్రత కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. క్రిస్మస్ కావడంతో వీరందరూ కూడా ఎరుపు రంగు డ్రెస్సులలో కనిపించటం విశేషం. ఇకపోతే ఉపాసన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో వేసుకున్నటువంటి డ్రెస్ ఖరీదు గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఉపాసన వేసుకున్నటువంటి ఈ డ్రెస్ గూచి బ్రాండ్ కు సంబంధించినదని తెలుస్తుంది.
ఇక ఈ క్రిస్మస్ డ్రెస్ కోసం ఉపాసన (Upasana) ఏకంగా మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారనే విషయం తెలియడంతో ఒకసారిగా అందరూ షాక్ అవుతున్నారు. కేవలం ఒక రోజు వేసుకునే ఈ క్రిస్మస్ స్పెషల్ డ్రెస్ కోసం ఉపాసన ఇన్ని లక్షల ఖర్చు చేశారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే సెలబ్రిటీలకు ఇది కామన్ అని చెప్పాలి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!