Upasana: నా కూతురికి ఆ ట్యాగ్ లు వద్దు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

చరణ్ ఉపాసన కూతురు క్లీంకార కొణిదెలకు సంబంధించి ఏ విషయం సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చినా కొన్ని క్షణాల్లోనే ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కూతురికి సంబంధించిన తొలి వీడియోను షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియోలో చరణ్, ఉపాసన ఆసక్తికర విషయాలను, విశేషాలను వెల్లడించారు. ఈ వీడియోలో ఎన్నో అద్భుతమైన విజువల్స్ ను చూపించడంతో పాటు ఉపాసన డెలివరీ రోజున, కూతురి నామకరణం రోజున తీసిన షాట్స్ ను చూపించారు.

పాపను చూసిన సమయంలో కుటుంబ సభ్యుల హావభావాలను సైతం ఈ వీడియో ద్వారా చరణ్ ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. చరణ్ మాట్లాడుతూ క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలో ఏదో తెలియని టెన్షన్ అని కామెంట్లు చేశారు. అంతా సరిగ్గా జరగాలని మేమంతా ప్రార్థిస్తున్నామని మేము కోరుకున్న విధంగానే పాప ఈ లోకంలోకి అడుగుపెట్టిందని భావిస్తున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు. పాప పుట్టిన క్షణాన చాలా సంతోషంగా మనసుకు ఆహ్లాదంగా అనిపించిందని రామ్ చరణ్ అన్నారు.

పాప రాకకు పట్టిన 9 నెలల సమయాన్ని, అప్పుడు జరిగిన ప్రాసెస్ ను తలచుకుని సంతోషంగా ఫీలయ్యామని రామ్ చరణ్ వెల్లడించారు. ఉపాసన మాట్లాడుతూ మా పాప ద్రవిడ సంస్కృతిలో భాగం కావాలని కోరుకుంటున్నామని కూతురి పేరుకు ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్స్ వద్దని అన్నారు. ఆ ట్యాగులను వారికి వారే స్వయంగా సంపాదించుకోవాలని నేను భావిస్తానని (Upasana) ఉపాసన పేర్కొన్నారు.

పిల్లల పెంపకంలో ఇవెంతో కీలకమని లైఫ్ లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని ఆమె వెల్లడించారు. ఉపాసన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లీంకార ఫోటోలను సైతం చరణ్ ఉపాసన త్వరలో రివీల్ చేయనున్నారని భోగట్టా.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus