యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టెంపర్ నుంచి టైమ్ మారింది. ఆ చిత్రం ఇచ్చిన విజయంతో ఎక్కడా ఆగకుండా దూసుకు పోతున్నారు. దీంతో అతని గురించి, అతని సినిమా గురించి ఏ చిన్న వీడియో వచ్చినా రెస్పాన్స్ భారీగా వస్తోంది. యూట్యూబ్ లో తారక్ వీడియో రావడమే ఆలస్యం వేగంగా లక్షల వ్యూస్ మార్క్ ని దాటేస్తోంది. జనతా గ్యారేజ్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ వీడియోలను 5 మిలియన్ కంటే ఎక్కువ సార్లు చూసారు. ఇలా యూట్యూబ్ లో చక్రం తిప్పుతున్న ఎన్టీఆర్ కి పోటీ ఇవ్వడానికి మెగా స్టార్ కోడలు ఉపాసన యూట్యూబ్ లో ప్రవేశించింది.
ఎంట్రీతోనే తారక్ రికార్డులను షేక్ చేస్తోంది. గత వారంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె తన తాత గురించి, భర్త రామ్ చరణ్ తేజ్ తో ప్రేమ, పెళ్లి విషయాలను వెల్లడించింది. తనపై వచ్చిన విమర్శలన్నింటికీ దైర్యంగా, స్పష్టంగా తిప్పికొట్టింది. ఎంతో ఆత్మ విశ్వాసంతో మాట్లాడిన ఉపాసన వీడియోని చూసేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ అందుబాటులోకి వచ్చిన వారం లోపునే ఒక మిలియన్ వ్యూస్ ని మార్క్ ని దాటేసింది. అతి త్వరలోనే 5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేస్తుందని నెటిజనులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే తారక్ రికార్డులన్నీ మరుగున పడిపోయినట్టే.