Upasana, Klin Kaara: కూతురిపై స్పెషల్ సాంగ్.. లాంచ్ చేసిన ఉపాసన?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పెళ్లైన 11 సంవత్సరాలకు తండ్రిగా ప్రమోట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఉపాసనని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నటువంటి రాంచరణ్ వీరి పెళ్లి అయిన తర్వాత 11 సంవత్సరాలకు తల్లి తండ్రులుగా మారారు. ఈ ఏడాది జూన్ 20వ తేదీ ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా ఉపాసన పాపకు జన్మనిచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పాప ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం ఎక్కడా బయట పెట్టలేదు

అయితే ఈ చిన్నారికి ఇంత చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పాలి ఎప్పుడెప్పుడు మెగా వారసురాలని అందరికీ పరిచయం చేస్తారా అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తాజాగా చిన్నారి క్లీన్ కారా కోసం ప్రత్యేకంగా ఒక పాటను కూడా సిద్ధం చేశారు అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పాటను ఉపాసన  చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ పాటకు మహావీర్ ఏళ్లందర్ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా.. బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ రాశారు. ఇక ఈ పాటను సింగర్ ధనుంజయ్ ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం క్లీన్ కార కోసం పాడినటువంటి ఈ పాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో కొన్ని ఫోటో క్లిప్స్ చూపించారు కానీ చిన్నారి ఫేస్ మాత్రం ఎక్కడ బయట పెట్టలేదు. ఇలా మెగా మనవరాలి కోసం స్పెషల్ సాంగ్ విడుదల చేయడంతో మెగా ఫాన్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus