ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్‌కి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయని ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ముంబయి వైద్యులు తెలియజేసిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా పవన్‌కు శస్త్రచికిత్స అవసరమని వైద్య నిపుణులు అప్పుడే స్పష్టం చేశారు. అప్పటికే కొన్ని అధికారిక కార్యక్రమాల కోసం ప్రణాళికలు, ఏర్పాట్లు చేసినందున వాటిని ముగించుకొని తరువాత శస్త్ర చికిత్స చేయించుకుంటా అని అప్పుడు పవన్ వైద్యులకు తెలియచేశారు. ఇప్పుడు అదే జర్జరీ చేశారు.
అయితే, రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. శుక్రవారం తొలుత వైద్య పరీక్షలు నిర్విహించి.. శనివారం ఆపరేషన్ సుమారు మూడున్నర గంటలు శస్త్రచికిత్స చేశారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేస్తారు. పవన్‌కి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు విశ్రాంతి అవసరం అని సూచించినా ఆయన తన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2018లో చేపట్టిన పోరాట యాత్రలో జనసేన పార్టీ శ్రేణులు దగ్గరగా వెళ్లి చేతులు కలపాలి అని అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా పవన్ భరించారు. ఆ తరవాత కూడా గాయాలను పవన్ అశ్రద్ధ చేశారు. అయితే ఏప్రిల్‌లో ముక్కుకి శస్త్ర చికిత్స చేయించుకున్న సందర్భంలో కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడే భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ, మజిల్ టీర్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.