Prabhas: ప్రభాస్ సినిమా రెడీ అయినట్లే!

‘బాహుబలి’ కోసం దాదాపు ఐదేళ్ల సమయం కేటాయించిన ప్రభాస్.. ఆ తరువాత ‘సాహో’ సినిమా కోసం మరో రెండేళ్లు వెచ్చించాడు. ‘రాధేశ్యామ్’ సినిమానైనా.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా కూడా బాగా డిలే అవుతూ వస్తోంది. బ్రేకులు తీసుకొని షూటింగ్ చేస్తూ వచ్చినా.. ఇంకా కొంత షూటింగ్ మిగిలే ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ షూటింగ్ ను ఇటీవలే పునః ప్రారంభించారు.

హీరోయిన్ పూజాహెగ్డే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే ప్రభాస్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడా..? లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఇంకా సెట్లో అడుగుపెట్టలేదని తెలుస్తోంది. ఈ నెల 23 నుండి ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

ప్రభాస్ పాత్రకు సంబంధించి రెండు వారాల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ప్రభాస్ బ్రేక్ తీసుకోకుండా రెండు వారాలు పని చేస్తాడని.. ఆగస్టు 5వ తేదీకి షూటింగ్ దాదాపుగా పూర్తయిపోతుందని సమాచారం. ఇక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి.. వచ్చే నెల చివరికి సినిమా రెడీ అయిపోవచ్చని అంటున్నారు. థియేటర్లు తెరుచుకొని పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే అప్పుడు సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 30న విడుదల కావాలి కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చక తప్పడం లేదు!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus