సమంతతో తనను పోల్చుకున్న ఉర్ఫీ!

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలు నేరుగా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. అయితే సెలబ్రిటీల వ్యవహారం ఏ మాత్రం నచ్చకపోయినా.. నెటిజన్లు విమర్శించడం ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది.

ముఖ్యంగా తారల డ్రెస్సింగ్ విషయంలో ఈ ట్రోలింగ్ చాలా దారుణంగా ఉంటుంది. తెలుగులో అనసూయను ఈ విషయంలో బాగా ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ డ్రెస్సింగ్ చర్చనీయాంశంగా మారింది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. తన అందాలను ఆరబోసే విధంగా దుస్తులు ధరిస్తుంటుంది. దీని వలన తరచూ ట్రోలింగ్ కి గురవుతుంటుంది.

ఈ మధ్యన ఆమె మరీ శృతి మించుతుండడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మీడియాలో కూడా ఆమెని విమర్శిస్తూ వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ఉర్ఫీ హర్ట్ అయినట్లు ఉంది. తనలా పలుచటి బట్టలు వేసుకున్న వారిని పొగిడి, తనను మాత్రం ఎందుకు తిడతారని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నించింది.

‘పలుచని షర్ట్‌ వేసుకున్న సమంత ఈ లుక్‌లో ఇంటర్నెట్‌ టెంపరేచర్‌ పెంచేలా ఉంది’ అని రాసి ఉన్న వార్తను.. ‘దోమల జాలి కంటే పలుచని డ్రెస్‌ వేసుకున్న ఉర్ఫీ స్టైల్‌ దరిద్రంగా ఉందని జనాలు తిడుతున్నారు’ అంటూ రాసి ఉన్న మరో వార్తకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను పోస్ట్ చేస్తూ.. ‘నేనేం చెప్పాలనుకున్నానో మీకీపాటికే అర్థమై ఉంటుంది. సమంత అంటే నాకూ ఇష్టమే, నేను కేవలం పైన రాసి ఉన్న హెడ్‌లైన్స్‌ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను’ అని చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus