బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గ్లామర్ ఫోటోషూట్లు, స్టేజ్ షోస్, స్పెషల్ సాంగ్స్‌తో పాటు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఉత్తరాఖండ్‌లో తన పేరుతో గుడి ఉందని చెప్పిన ఊర్వశి, ఇప్పుడు దక్షిణ భారతంలో కూడా అలాంటి గుడి కావాలంటూ అసాధారణ కోరికను వెలిబుచ్చింది.
ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, “ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ టెంపుల్ పక్కన నా పేరుతో ఒక గుడి ఉంది. మీరు అటు వెళ్లినప్పుడు ఒకసారి చూచి వస్తే బాగుంటుంది” అంటూ చెప్పింది. అంతేకాదు, ఢిల్లీ యూనివర్సిటీలో తన ఫోటోకు పూలమాలలు వేసి పూజించడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపింది. అలాంటి గౌరవం చూసి తాను షాక్ అయ్యానని, ఇప్పుడు సౌత్‌లో తనకు ఉన్న క్రేజ్ వల్ల అక్కడ కూడా గుడి కట్టాలని ఆశించడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించింది.
ఆమె అడిగిన వింత కోరికపై యాంకర్ ఆసక్తికర ప్రశ్నను వేయగా, ఊర్వశి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. “గుడిలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఆశీర్వాదాలు కావాలనుకునేవాళ్లు వస్తారు” అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ‘ఇది ఏంటి మేడమ్!’, ‘తనంత తానే దేవతలా భావిస్తోందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కెరీర్ పరంగా చూస్తే, ఊర్వశి రౌతేలా బాలీవుడ్‌లో అడుగుపెట్టి సౌత్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటోంది.
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ‘ఏజెంట్’ (Agent) ‘బ్రో’ (BRO) , స్కంద (Skanda) సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌తో మెరిసిన ఆమె, ఇటీవల బాలయ్యతో (Nandamuri Balakrishna) డాకు మహారాజ్ (Daaku Maharaaj) చిత్రంలో ‘దబిడి దిబిడి’ పాటలో దుమ్మురేపింది. ఇప్పుడు ఆలయ కోరికతో మరోసారి మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. వింత కోరిక అయినా, ఊర్వశి స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీసింది. సాధారణంగా అభిమానులు తమ అభిమాన తారల కోసం గుడులు కడతారు కానీ, తాము స్వయంగా గుడి కోరుకోవడం మాత్రం చాలా అరుదైన విషయం. మరి ఈ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందో లేదో చూడాలి.