ఆగస్టు 15న ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ‘తంగలాన్’ (Thangalaan) వంటి పెద్ద సినిమాలతో పాటు ‘ఆయ్’ (AAY) అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అయ్యింది. చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా.. వాటి కంటే బాగా పెర్ఫార్మ్ చేసి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) ఈ సినిమాలో హీరో. అంజి కె మణిపుత్ర దర్శకుడు. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
గోదావరి నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా ఇది. అలాగే ఫ్రెండ్షిప్ థీమ్ తో ఓ చిన్న పాటి మెసేజ్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో తండ్రి వినోద్ కుమార్ (Vinod Kumar) పాత్రని ఓ రేంజ్లో హైలెట్ చేశారు సినిమా వినోద్ కుమార్ పాత్ర మొదటి నుండి చాలా సింపుల్ గా చూపించారు. కొడుకుతో కూడా మాటలు పడే అసమర్ధుడు అనే విధంగా అతని పాత్ర కనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో కథని మొత్తం మలపు తిప్పుతూ..
బ్లాక్ బస్టర్ సినిమా ఇది అని చెప్పించేలా చేస్తుంది. మెగా అభిమానులకు ఈ పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది అనడంలో సందేహం. అడబాల బూరయ్య అనే పాత్ర ఆయ్ కి పెద్ద ప్లస్ పాయింట్. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో వినోద్ కుమార్ కి మొదటి హిట్ అందించిన సినిమా కూడా అని చెప్పాలి. అయితే ఈ అడబాల బూరయ్య పాత్ర ముందుగా వినోద్ కుమార్ కోసం రాసుకుంది కాదట.
మరో సీనియర్ హీరో రిజెక్ట్ చేయడం వల్ల వినోద్ కుమార్ వద్దకి వెళ్లిందట. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు వడ్డే నవీన్ (Vadde Naveen) . అవును అప్పట్లో లవ్ అండ్ యాక్షన్ మూవీస్ చేసి యూత్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు వడ్డే నవీన్. కానీ తర్వాత ప్లాపులు పడటంతో డౌన్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘గోపి – గోడ మీద పిల్లి’ ‘ఎటాక్’ (Attack) వంటి సినిమాల్లో నటించాడు.
కానీ అవి కూడా నిరాశపరచడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ‘ఆయ్’ లో అడబాల బూరయ్య పాత్ర కోసం ఇతన్ని సంప్రదిస్తే.. సున్నితంగా తిరస్కరించాడట. అతను కనుక చేసి ఉంటే.. ఈ పాత్రకి ఇంకా అందం వచ్చేదేమో కానీ..! వినోద్ కుమార్ కూడా ఎక్కడా తగ్గకుండా హుందాగా చేశాడు అనే చెప్పాలి.