కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా… ఈనెల 28, ఆదివారం సాయంత్రం “వైష్ణవ జనుడవు నీవే అయితే” జాతిపిత మహాత్మాగాంధీ ప్రార్థనాగీతం ఆవిష్కరణ సభ!!

మహాత్మాగాంధీ తన దినచర్యలో భాగంగా ఓ ప్రార్ధనాగీతం ఆలపించేవారు. 14 వ శతాబ్దంలో.. నరసింహ మెహతా అనే కవి అవద్ భాషలో రాసిన గీతమిది. మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో ఈ గీతం ప్రతిధ్వనిస్తుండేది. ఈ గీతాన్ని తెలుగులో రాసి విడుదల చేస్తున్నారు శ్రీ వెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ కమలా రామన్. ‘ఆనంద్, గోదావరి, చందమామ’ వంటి సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్ స్వర సారధ్యం వహించిన ఈ ప్రార్ధనాగీతానికి… ప్రముఖ గాయనీమణి ఉషతో కలిసి సుప్రసిద్ధ గాయకులు ఉన్నికృష్ణన్ గాత్ర మందించారు.

ఈ గీతాన్ని ఈనెల 28, ఆదివారం సాయంత్రం 6 గంటలకు.. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నిర్వహించేందుకు గీత రచయిత్రి-శ్రీవెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు శ్రీమతి కమలారామాన్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలకాలంలో కొరవడిపోతున్న దేశభక్తిని ప్రజల్లో పెంపొందించాలనే సత్సంకల్పంతో “వైష్ణవ జనుడవు నీవే అయితే” గీత రూపకల్పనకు నడుం కట్టామని డాక్టర్ కమల పేర్కొన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో.. ఎమ్.ఎల్.సి. రామచంద్రరావు, ప్రముఖ నటులు, మాజీ మంత్రి బాబుమోహన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటులు అలీ, బ్రిగేడియర్ వి.శ్రీనివాసరావు విశిష్ట అతిధులుగా పాల్గొంటున్నారు!!

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus