మెగా కుటుంబంలో హీరోలు చేసే సినిమాల కథలు చిరంజీవి కచ్చితంగా వింటారని అంటుంటారు. 150కిపైగా సినిమాలు చేసిని చిరంజీవి జడ్జిమెంట్ బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే తన కుటుంబ హీరోల సినిమా కథలు విని అవసరమైతే మార్పులు సూచిస్తుంటారని అని కూడా అంటుంటారు. అయితే వైష్ణవ్‌తేజ్ విషయంలో ఇది జరగడం లేదా… ఆయన మాటలు చూస్తే అలానే అనిపిస్తోంది. ‘కొండపొలం’ గురించి వైష్ణవ్‌తేజ్ ఎప్పుడూ వినలేదట. అందుకే కథ విన్నప్పుడు కొత్తగా అనిపించిందట.
ఫాంటసీ ఎలిమెంట్స్ బాగా నచ్చాయట. అందుకే వెంటనే ఓకే చేసేశారట. దీంతో అసలు ఈ సినిమా కథ చిరంజీవి వినలేదా… తన ఆలోచనలు చెప్పలేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి తోడు ‘మా కుటుంబంలో ఇంతమంది నటులున్నా నా చిత్రాల గురించి ఎవరి దగ్గరా ప్రస్తావించను’ అని చెబుతున్నాడు వైష్ణవ్. దానికి కారణం కూడా చెప్పాడు వైష్ణవ్‌తేజ్. ‘ఫలానా కథ విన్నాను.. ఎలా ఉంది. అని కథ గురించి చెప్పి ఎవరినీ అడగను’ అని చెబుతున్నాడు వైష్ణవ్.
సిగ్గు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని కూడా చెబుతున్నాడు. అయితే వైష్ణవ్ అడగకుండా ఉంటే మెగా హీరోలు ఊరుకుంటారా? కెరీర్‌ను నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా కథలు విని, ఎలాగున్నాయో తప్పక చెబుతారు. మరి వైష్ణవ్ ఇలా ఎందుకన్నాడో.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!