కొవిడ్ 19 – లాక్‌డౌన్ సమయంలో షూటింగ్ అంటే చాలా కష్టం. కానీ ‘కొండపొలం’ టీమ్ చాలా జాగ్రత్త చర్యలు తీసుకొని మరీ సినిమా పూర్తి చేసింది. అందులోనూ చిత్రీకరణ ఎక్కువ భాగం అడవిలోనే సాగింది. అందరం సెట్‌బాయ్స్‌లా మారి వస్తువులు మోసుకుంటూ అడవిలోకి వెళ్లాం అంటూ ఆ మధ్య దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చారు. తాజాగా హీరో వైష్ణవ్ తేజ్ ఈ సినిమా ప్రయాణంలోని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్ కోసం ఎన్నో కొండలు ఎక్కాం, వాహనాలు అందుబాటులో లేకపోవడంతో చిత్రీకరణ జరిపే ప్రదేశానికి నడిచే వెళ్లేవాళ్లం.
ఒక్కోసారి షూటింగ్ సామాను మేమే తీసుకెళ్లేవాళ్లం కూడా. అంతకంటే రోజంతా మాస్క్ పెట్టుకుని ఉండటం కష్టమనిపించింది. మాస్క్ కంటిన్యూస్‌గా ఉంచడం వల్ల సరిగా ఊపిరి ఆడేది కాదు. కొన్ని రోజుల తర్వాత అలవాటైంది అని చెప్పాడు వైష్ణవ్ తేజ్. సినిమాలో వైష్ణవ్ తేజ్ గొర్రెల్ని అడవికి తీసుకెళ్లి కొండపొలం చేసే యువకుడిగా కనిపిస్తాడని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఈ క్రమంలో గొర్రెల్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు.
గొర్రెలపై సన్నివేశాలు చిత్రీకరించేటపుడు వాటి భాషని అర్థం చేసుకోలేకపోయడట వైష్ణవ్. అయితే వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని తెలిసి… తర్వాత ఇవ్వడం మొదలుపెట్టాడట. అలా గొర్నెల్ని కంట్రోల్ చేశా అని చెప్పాడు వైష్ణవ్.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!