Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేసి హిట్టు కొట్టాలని చాలా మంది మేకర్స్ భావిస్తారు. ‘కాకపోతే మాతృక ఎందుకు హిట్ అయ్యింది’ అనే విషయాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకుండా.. యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఉన్నట్టు దింపేస్తే అదే ఫలితం వస్తుంది అనుకోవడం అమాయకత్వం అవుతుంది. కొంతమంది ఫిలిం మేకర్స్ ఈ పొరపాట్లు చేసి బ్లాక్ బస్టర్ సినిమాలను చెడగొట్టారు.

Vajram

అందులో ‘వజ్రం'(Vajram) ఒకటి. అక్కినేని నాగార్జున, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపొందిన ‘స్పాడికం’ కి ఇది రీమేక్. ‘స్పాడికం’ మలయాళంలో ఇండస్ట్రీ హిట్ సినిమా. తల్లిదండ్రులు పిల్లల విషయంలో… చదువు కంటే వారి మేధస్సు, భావోద్వేగాలని గ్రహించి వారు భవిష్యత్తులో ఎదిగేలా ప్రోత్సహించాలి అనేది ‘స్పాడికం’ కోర్ పాయింట్. చాలా మంచి లైన్ అది.

అంతర్లీనంగా మంచి మెసేజ్ కూడా దాగి ఉంది.అందుకే ఏరి కోరి ఆ సినిమా రీమేక్ రైట్స్ ని నిర్మాత సి.గౌతమ్ కుమార్ రెడ్డితో కొనుగోలు చేయించారు నాగార్జున.దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి ఆరోజుల్లో ఆయన కేర్ ఆఫ్ అడ్రెస్. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం ‘స్పాడికం’ కథలో ఆయన చాలా మార్పులు చేశారు. తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ వరకు ఓకే కానీ విలన్ ట్రాక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు ఎస్వీ కృష్ణారెడ్డి.

ముఖ్యంగా కె.విశ్వనాథ్ కి ఆడియన్స్ లో ఒక రకమైన పాజిటివ్ ఇమేజ్ ఉంది. అందువల్ల ఆయన్ని అంత కఠినంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. వాస్తవానికి ఆ పాత్రకి మొదట నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారినే సంప్రదించారట.కానీ ఆయన చేయలేకపోయారు.కారణాలు ఏమైనా 1996 జనవరి 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వజ్రం’ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలోని పాటలు మాత్రం బాగుంటాయి.ఈ జనవరి 5కి ‘వజ్రం’ రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు పూర్తికావస్తోంది.

‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus