పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మిడ్ రేంజ్ డైరెక్టర్ మారుతీతో ‘ది రాజాసాబ్'(The RajaSaab) సినిమా చేస్తున్నాడు అని తెలిసినప్పటి నుండి.. ఆడియన్స్..లో కానీ ఫ్యాన్స్ లో కానీ ఒక రకమైన భయం ఏర్పడింది.అందుకు తగ్గట్టే ఈ సినిమా రిలీజ్ కూడా డిలే అవుతూ రావడం వల్ల.. ఆ భయాలు మరింత రెట్టింపు అయ్యాయి. ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన టీజర్ కానీ మొదటి ట్రైలర్ కానీ, ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ‘రెబల్ సాబ్’, సెకండ్ సింగిల్ గా వచ్చిన ‘సహనా సహనా’ వంటి పాటలు కానీ ఏమాత్రం హోప్స్ ఇవ్వలేదు.
కొన్ని స్టిల్స్ పై అయితే ట్రోలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరిగింది. దీంతో ‘ది రాజాసాబ్’ ఫలితం కూడా గతేడాది వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ లా అయిపోతుందేమో అనే కంగారు కూడా జనాల్లో మొదలైంది.అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి కొంత పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. ఆ ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ అందరికీ నచ్చింది. ముఖ్యంగా పోటీ సినిమా అయిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ టీం కూడా హ్యాపీగా ఫీలయ్యింది. అలాగే తర్వాత వచ్చిన సెకండ్ ట్రైలర్ కూడా బాగుంది.
‘ది రాజాసాబ్’ కథ, కథనాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం పై ఆడియన్స్ కి ఆ ట్రైలర్ తో దర్శకుడు మారుతీ ఇచ్చిన క్లారిటీ కూడా బాగుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ‘నాచే నాచే’ సాంగ్ అయితే మార్మోగుతుంది అనే చెప్పాలి. ఈ పాటలో ప్రభాస్ లుక్స్ బాగున్నాయి. ముగ్గురు హీరోయిన్ల పక్కన ప్రభాస్ చేసిన డాన్స్ మూమెంట్స్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
థియేటర్లలో ఈ పాటకి ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయం అని చెప్పొచ్చు. మొత్తానికి రీసెంట్ ప్రమోషనల్ కంటెంట్ తో ‘ది రాజాసాబ్’ కి ఊపొచ్చిందనే చెప్పాలి.