ఒక్కసారిగా స్టార్‌ ప్రొడ్యూసర్‌లో ఈ మార్పులేంటబ్బా

  • February 4, 2021 / 04:07 PM IST

బోనీ కపూర్‌ అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. పాతికేళ్ల వయసులోనే నిర్మాతగా మారి… కొన్నేళ్లుగా విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నాడు. తాజాగా తెలుగులో పవన్‌ కల్యాణ్‌తో ‘వకీల్‌ సాబ్‌’ రూపొందించారు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా ఆయన తొలిసారి నటుడిగా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా లవ్‌ రంజన్‌ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో రణ్‌బీర్‌ తండ్రిగా బోనీ కపూర్‌ కనిపించనున్నారు. మరోవైపు దర్శకుడిగా కూడా మారాలని అనుకుంటున్నాడట.

‘లవ్‌ రంజన్‌ కారణంగానే రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాలో నటించడానికి అంగీకరించాను. ఆ పాత్ర గురించి మొదట లవ్‌ రంజన్‌ నా పిల్లల్ని కలిశాడు. నేను సినిమాలో నటించడానికి నా పిల్లలే ఒప్పించారు. ఏ విషయంలోనూ నేను వాళ్లకి నో చెప్పలేను. 25 ఏళ్ల వయసులోనే నిర్మాతగా మారాను. అయితే దర్శకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాను. ఎప్పటికైనా దర్శకత్వంలోకి అడుగుపెడతాను. ఇది వీలైనంత త్వరగా జరిగేలా ఉంది. ఎందుకంటే డైరెక్షన్‌కు ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. త్వరలోనే పనిని ప్రారంభిస్తా’’ అని చెప్పుకొచ్చారు బోనీ కపూర్‌.

బోనీ కపూర్‌కి చాలా సంవత్సరాల క్రితమే నటించే అవకాశం వచ్చింది. యశ్‌ చోప్రా రూపొందించిన ‘లమ్హే’లో అతనికి ఓ కీలక పాత్ర ఆఫర్‌ చేశారు. ఆ సినిమాలో శ్రీదేవి కథానాయిక. ఇందులో ఆయన శ్రీదేవి ప్రియుడిగా నటించాలి. ఆ సినిమాతో శ్రీదేవికి కొంతైనా దగ్గర కావొచ్చనే ఉద్దేశంలో అప్పట్లో బోనీ ఓకే చేశారట. ‘లమ్హే’ చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న సమయంలో అనివార్య కారణాల వల్ల బోనీ షూట్‌లో పాల్గొనలేకపోయారట. అలా ఆయన స్థానంలోకి దీపక్‌ మల్హోత్రా వచ్చారట. అప్పుడు వీలుకానిది ఇప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాతో నెరవేర్చుకుంటున్నారన్నమాట.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus