కోలీవుడ్ ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్ కి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్ గా కాకపోయినా.. సినిమాలో కీలకపాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘క్రాక్’, ‘నాంది’ సినిమాలు హిట్ అవ్వడంతో ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. తాజాగా ఆమె మరో సినిమాకి సైన్ చేసిందని అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమాగా ‘హనుమాన్’ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలుగులో తొలిసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా ఇది. ఇందులో ముఖ్య పాత్ర కోసం వరలక్ష్మీను తీసుకున్నారట. సినిమాలో ఆమె రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోని ఫైనల్ చేయలేదు కానీ.. తేజ సజ్జాను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తేజ సజ్జాను హీరోగా పరిచయం చేస్తూ ‘జాంబీ రెడ్డి’ అనే సినిమా తీశాడు ప్రశాంత్ వర్మ.
ఇప్పుడు మరోసారి అతడినే తన సినిమాలో హీరోగా అనుకుంటున్నాడు. ప్రస్తుతం హీరోలంతా బిజీగా ఉండడంతో తేజనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి.