Varanasi :’వారణాసి’ మూవీ టీజర్ రిలీజ్ కు సర్వం సిద్ధం..!

Varanasi : దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. RRR తర్వాత ఆయన నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే లక్ష్యంతో మేకర్స్ ముందడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంతో తొలిసారి పాన్ఇండియా బరిలో నిలవబోతున్నారు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ‘మందాకినీ’ అనే శక్తివంతమైన పాత్రలో కనపడబోతున్నారు. ‘కుంభ’ అనే కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనుండటంతో క్యాస్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇప్పటికే పాత్రల పరిచయాలు, ఫస్ట్ లుక్స్ అభిమానుల్లో హైప్ పెంచాయి. ఈ క్రమంలోనే టైటిల్ వీడియో అంతర్జాతీయంగా వైరల్ కావడం సినిమాపై గ్లోబల్ ఆసక్తిని మరింత పెంచింది. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే.. ‘వారణాసి’ టీజర్ లాంచ్.  జనవరి 5న రాత్రి 9గం.లకు ప్రపంచ ప్రసిద్ధ వేదిక అయిన పారిస్‌లోని Le Grand Rex థియేటర్‌లో టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు సమాచారం. యూరప్‌లోనే అతిపెద్ద స్క్రీన్‌లలో ఒకటైన ఈ హాల్‌లో భారతీయ సినిమా టీజర్ ప్రదర్శన జరగడం విశేషం.

2027 సమ్మర్ విడుదలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వారణాసి, ముందస్తు ప్రమోషన్‌తోనే ప్రపంచ ప్రేక్షకుల్ని పలకరించే ప్రయత్నం చేస్తోంది. హడావుడి కాకుండా స్ట్రాటజీతో హైప్ క్రియేట్ చేస్తున్న రాజమౌళి ప్లాన్ మరోసారి సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ వేదికపై రిలీజ్ అవుతున్న తోలి భారతీయ  టీజర్ ఇదేనంట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus