Varasudu Movie: దిల్ రాజు బుర్రే బుర్ర.. వారసుడుపై ఇంత నమ్మకమా?

విజయ్ హీరోగా నటించిన వారసుడు మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. దిల్ రాజు ఈ సినిమా కోసం భారీ సంఖ్యలో థియేటర్లను బుకింగ్ చేయడం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా 50 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం గమనార్హం. ఈ రీజన్ వల్లే దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ థియేటర్లను వారసుడు సినిమాకు కేటాయిస్తున్నారని సమాచారం.

వంశీ పైడిపల్లి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకులలో ఒకరు కావడంతో ఆయన పేరు మీద దిల్ రాజు బ్రాండ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ రేంజ్ లో కలెక్షన్లు రావడం కష్టం కాదని దిల్ రాజు భావిస్తున్నారని తెలుస్తోంది. భారీ మొత్తం ఇన్వెస్ట్ చేసి సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు అదే సమయంలో ఆ సినిమాలతో భారీ లాభాలను సొంతం చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వారసుడు సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే.

నేషనల్ క్రష్ రష్మికకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ఉండటం వల్ల కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తమిళం, తెలుగుతో పాటు వారసుడు మూవీ హిందీలో కూడా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. విజయ్ సినీ కెరీర్ కు కూడా వారసుడు సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ రేంజ్ కు 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధపడుతున్నారు.

విజయ్ గత సినిమా బీస్ట్ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా విజయ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా నచ్చిందనే సంగతి తెలిసిందే. వారసుడు సినిమా విజయ్ రేంజ్ ను మరింత పెంచడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus