Varsha Bollamma: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వర్ష బొల్లమ్మ.. ఏమన్నారంటే?

  • January 21, 2024 / 10:19 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఊరు పేరు భైరవకోన సినిమాలో హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదని నటిని కావాలనుకున్న సమయంలో నా పేరెంట్స్ ఎంతగానో సపోర్ట్ చేశారని వర్ష బొల్లమ్మ కామెంట్లు చేశారు. పేరెంట్స్ వల్లే నేను ఈ స్థాయికి రాగలిగానని వర్ష బొల్లమ్మ పేర్కొన్నారు.

తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలలో నటిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు. కెరీర్ పరంగా సంతోషంగా ఉన్నానని వర్ష బొల్లమ్మ వెల్లడించారు. అన్ని ప్రాంతాల ప్రేక్షకులు నన్ను ఇంటి మనిషిగా అభిమానిస్తున్నారని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. మిడిల్ క్లాస్ మెలోడీస్ రిలీజైన తర్వాత తెలుగువాళ్ల నుంచి చాలా ప్రశంసలు వచ్చాయని వర్ష అన్నారు. నా ప్రతి మూవీ షూటింగ్ కు అమ్మ తోడుగా వస్తారని నేను సినిమాలలో ఏదైనా మ్యారేజ్ సీన్ లో నటిస్తే అది చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారని వర్ష బొల్లమ్మ వెల్లడించారు.

ప్రస్తుతానికి మ్యారేజ్ ప్లాన్ లేదని మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని వర్ష బొల్లమ్మ అన్నారు. నాకు కాబోయే వాడు తరతమ బేధాలు చూపించకుండా మంచి మనస్సున్న వ్యక్తి అయితే చాలని ఆమె పేర్కొన్నారు. ఊరు పేరు భైరవకోన ట్రైలర్ కు 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వర్ష బొల్లమ్మ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని తెలుస్తోంది.

వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇతర భాషల్లో సైతం వర్ష బొల్లమ్మ సత్తా చాటి పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వర్ష బొల్లమ్మ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus