Prabhas: డార్లింగ్ ప్రభాస్ కోసమే ఆ డేట్ లాక్ చేశారా?

  • October 20, 2022 / 03:39 PM IST

అక్టోబర్ 23 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్బంగా ఇంతకుముందెన్నడూ లేని విధంగా హంగామా చెయ్యడానికి రెడీ అవుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ లో ప్రభాస్ నటించిన ‘బిల్లా’ మూవీ స్పెషల్ షోస్ వేస్తున్నారు. సినిమా రిలీజ్ అప్పుడు ఎంత రచ్చ రంబోలా ఉంటుందో అంతకుమించి అనేలా సందడి చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటిచెప్పడమే కాక గ్లోబల్ స్టార్ గా మారి తెలుగు వాళ్లకి గర్వకారణంగా నిలిచిన

తమ ఫేవరెట్ హీరో పుట్టినరోజుని ఓ పండుగలా జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ కోసం కొద్ది రోజుల ముందుగానే ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలను డిజిటలైజేషన్ చేయించి.. HD క్వాలిటీతో 4K లోకి రెడీ చేయించారు దర్శక నిర్మాతలు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ వారిని నిరుత్సాహానికి గురిచేసే న్యూస్ ఒకటి నెట్టింట స్ప్రెడ్ అవుతోంది. ‘బిల్లా’ స్పెషల్ షోలతో పాటు ప్రభాస్, త్రిష నటించిన బ్లాక్ బస్టర్ లవ్ ఎంటర్ టైనర్ ‘వర్షం’ మూవీని రీ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు

నిర్మాత ఎమ్.ఎస్.రాజు. శోభన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ముందుగా అక్టోబర్ 22న ‘వర్షం’ మూవీని లిమిటెడ్ థియేటర్స్ లో రీ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేశారు. ప్రభాస్ సినీ జర్నీలో నవంబర్ 11వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆరోజే డార్లింగ్ యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ‘ఈశ్వర్’ రిలీజ్ అయ్యింది.

2002 నవంబర్ 11న విడుదలైన ‘వర్షం’ ఈ ఏడాదితో 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. అంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రభాస్ కూడా 20 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు కాబట్టి డార్లింగ్ కోసం ఆ డేట్ ని లాక్ చేశారు. నవంబర్ 11న ‘వర్షం’ రి రిలీజ్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus