అంతకుముందు కూడా కొంతమంది అన్నారనుకోండి

  • January 11, 2021 / 12:11 PM IST

టాలీవుడ్‌లో ఏ హీరో స్టైల్‌ బాగుంటుంది అని అడిగితే ఎక్కువ మంది చెప్పే పేర్లలో అల్లు అర్జున్‌ తప్పకుండా ఉంటుంది. తొలి సినిమా నుంచి తన స్టయిల్‌ను ఇంప్రూవ్‌ చేసుకుంటూ, స్టైల్‌ ఐకాన్‌గా, స్టైలిష్‌ స్టార్‌గా మారిపోయాడు. ప్రతి సినిమాలోనూ తనదైన స్టయిల్‌ను మిక్స్‌ చేస్తూ కొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అందుకే అందరికీ నచ్చుతున్నాడు. ప్రేక్షకులకే కాదు ఇతర హీరోలకు కూడా బన్నీ స్టయిల్‌ అంటే ఇష్టం. ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతుంటారు. తాజాగా మరో హీరో అదే మాట చెప్పాడు. ఆ హీరో బాలీవుడ్‌ నుంచి కావడం విశేషం.

బాలీవుడ్‌ అందగాళ్లలో వరుణ్‌ ధావన్‌ ఒకడు. అందగాడనే కాదు.. స్టయిల్‌తోనూ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇటీవల ఓ టీవీ షోలో వరుణ్‌కు ‘మీ దృష్టిలో స్టయిలిష్‌ యాక్టర్‌ ఎవరు?’ అని హోస్ట్‌ అడిగాడు. దానికి వరుణ్‌ ఠక్కున అల్లు అర్జున్‌ చెప్పేశాడు. దానికి ఆ హోస్ట్‌ ‘అల్లు అర్జున్‌?’ అంటూ చిన్న క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌ కూడా పెట్టాడు. బాలీవుడ్‌లో అంతమంది స్టయిల్‌ అండ్‌ స్టైలిష్‌ యాక్టర్స్‌ ఉండగా… వరుణ్‌ ధావన్‌ ఏకంగా బన్నీ పేరు చెప్పడం ఆసక్తికర విషయమే కదా.

అన్నట్లు బన్నీని బాలీవుడ్‌ హీరోలు మెచ్చుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో షాహిద్‌ కపూర్‌ కూడా బన్నీని పొగిడేశాడు. అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. టైగర్‌ ష్రాఫ్‌ కూడా అల్లు అర్జున్‌ అభిమానుల్లో ఒకడు. ఇన్‌స్టాగ్రామ్‌ ‘క్యూ అండ్‌ ఏ’లో ‘తనకు నచ్చిన టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus