Varun Tej: నేను చిరంజీవి సైడ్ చరణ్ కళ్యాణ్ బాబాయ్ సైడ్..వరుణ్ కామెంట్స్ వైరల్!

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే కొన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. కొన్ని ఏరియాలలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఇంకా మొదలవ్వాల్సి ఉంది. తాజాగా వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాల్యంలో చరణ్ అన్నకు, నాకు మధ్య గొడవ జరిగేదని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వేర్వేరు కూల్ డ్రింక్ యాడ్స్ లో నటించేవారని ఆ యాడ్స్ టీవీలో పోటాపోటీగా ప్రసారమయ్యేవని వరుణ్ తేజ్ అన్నారు.

ఆ సమయంలో నేను చిరంజీవి గారి సైడ్, చరణ్ కళ్యాణ్ బాబాయ్ సైడ్ ఉండేవారని ఆయన కామెంట్లు చేశారు. చిరంజీవి నటించిన యాడ్ కూల్ డ్రింక్ తాగేవాళ్లు మెన్ అని మిగతావాళ్లు బచ్చా అని నేను ట్రోల్స్ చేసేవాడినని వరుణ్ పేర్కొన్నారు. చిరంజీవి గారు ఇంట్లో ఉన్న సమయంలో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని చిరంజీవి గారు వెళ్లిపోగానే చరణ్, కళ్యాణ్ బాబాయ్ లైట్స్ ఆఫ్ చేసిన రూమ్ లోకి నన్ను పంపించి డోర్ లాక్ చేసి నన్ను భయపెట్టేవారని వరుణ్ తేజ్ వెల్లడించారు. వరుణ్ తేజ్ సరదాగా చెప్పిన విషయాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఆపరేషన్ వాలంటైన్ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. (Varun Tej) వరుణ్ తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది. తను నటించే సినిమాలలో ఒక సినిమాకు మరో సినిమాకు పోలిక లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరుణ్ తేజ్ వరుస విజయాలను సొంతం చేసుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus