వరుణ్.. బాలయ్య పై కౌంటర్ వేశాడా?

తాజాగా ‘బాలయ్య అంటే ఎవరో నాకు తెలీదు’ అంటూ సంచలన కామెంట్ చేసాడు మెగా బ్రదర్ నాగబాబు. దీని పై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రచ్చ జరిగిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే ఒక సంచలన కామెంట్ అంటే నెక్స్ట్ రోజు కమెడియన్ బాలయ్య నాకు తెలుసంటూ మరో వివాదాస్పద కామెంట్ చేసి నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహానికి తెరలేపినట్టయ్యింది. ప్రస్తుతానికి అయితే ఇది కాస్త సర్దుమణిగినట్టయింది.

ఇదిలా ఉంటే డిసెంబర్ 21 న (రేపు) విడుదల కాబోతున్న ‘అంతరిక్షం’ చిత్ర ప్రమోషన్స్ భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ కు ఈ అంశం పై ఒక ప్రశ్న ఎదురయ్యిందంట… దీని పై వరుణ్ తన స్టయిల్ల్లో ధీటుగా సమాధానం ఇచ్చాడంట. అయితే తర్వాత ఆ బిట్ ను డిలేట్ చేయమని కోరినట్టు తెలుస్తుంది. తన సినిమా విడుదల ఉండడంతో చిత్ర యూనిట్ ఇలాంటి వివాదాస్పద కామెంట్లు చేయొద్దని రిక్వెస్ట్ చేయడంతో వరుణ్ రాజీపడినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. పైకి అంత సాఫ్ట్ గా కనిపించే వరుణ్ తేజ్ బాలయ్య గురించి ఏం కామెంట్స్ చేసాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ తాత్కాలికంగా సర్దుకున్నట్టు అనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు నెలకొంటాయో.. చూడాలి మరి.!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus