మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా..!

‘ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కోలీవుడ్ లో కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వచ్చి సూపర్ హిట్టయిన ‘జిగిర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్. తమిళ్ లో బాబీసింహా చేసిన పాత్రని ఇక్కడ వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఇక సిద్ధార్థ్ పాత్రకు గాను శ్రీ విష్ణువును తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట రష్మిక మందన ని తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఇప్పుడు ఈషా రెబ్బా ను తీసుకున్నట్టు తాజా సమాచారం. రష్మిక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో… ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుందని.. దాంతో ఇప్పుడు ఈషా రెబ్బా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈషా రెబ్బా కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ… అవకాశాలు పెద్దగా రావట్లేదనే చెప్పాలి. ‘అరవింద సమేత’ లాంటి క్రేజీ ప్రాజెక్టులో నటించినప్పటికీ… పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కి ఈషా రెబ్బా ఫైనల్ అయితే తన దశ తిరిగినట్టే.. అని చెప్పాలి. ఎందుకంటే హరీష్ శంకర్ చిత్రంలో హీరోయిన్ కి కచ్చితంగా మంచి పాత్రనే ఇస్తాడు.. అంతేకాకుండా హరీష్ చిత్రంలో నటించిన ప్రతీ హీరోయిన్ కు .. తరువాత ఓ పెద్ద సినిమా అవకాశం కచ్చితంగా వస్తుంది. ఉదాహరణ కి శృతి హాసన్, పూజా హెగ్దే లను చెప్పుకోవచ్చు. వీరితో పాటూ.. ‘మిరపకాయ్’ చిత్రంలో నటించిన రిచా, దీక్ష సేధ్ లకు ప్రభాస్ పక్కన నటించే అవకాశం దక్కింది. అంతే కాకుండా తమిళ్ ,కన్నడ వంటి చిత్రాలలో హీరోయిన్లుగా వరుస అవకాశాలు దక్కించుకున్నారు. ఇక రెజీనా కి కూడా మంచి అవకాశాలు దక్కాయి. సో ఈ లిస్టులో ఈషా రెబ్బా చేరినా ఆశ్చర్య పడనవసరం లేదు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus