Vasanthi, Rohit: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి హౌస్ మేట్స్ షాక్..! ఎవరు నామినేట్ అయ్యారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం ఎమోషనల్ బ్యాటరీ ఛార్జింగ్ జరుగుతోంది. హౌస్ లో 100 శాతం బ్యాటరీ హౌస్ మేట్స్ వీడియో, ఆడియాకాల్స్ తో తగ్గిపోతూ వస్తోంది. బాలాదిత్య ఫోన్ కాల్ వాడుకోగానే బ్యాటరీ 0 పర్సెంట్ కి వచ్చేసింది. దీంతో బిగ్ బాస్ మళ్లీ రీఛార్జ్ చేస్తారా ? లేదా అనేది హౌస్ మేట్స్ లో ఆందోళన మొదలైంది. ఇక్కడే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ట్విస్ట్ ఇచ్చాడు. వాసంతీ, ఇంకా రోహిత్ ఇద్దరిలో రెండు వారాల పాటు నేరుగా నామినేట్ ఎవరైనా అయితే ఇంట్లో బ్యాటరీ 100 శాతానికి ఉంటుందని చెప్పాడు.

దీంతో వాసంతీ ఇంకా రోహిత్ ఇద్దరి మద్యలో డిస్కషన్స్ మొదలు అయ్యాయి. వాసంతీ అయితే నేను రెండు వారాలు పాటు వెళ్లలేను అంటూ మాట్లాడింది. అలాగే రోహిత్ కూడా ఆలోచనలో పడ్డాడు. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే, వాసంతీ ఇంకా రోహిత్ ఇద్దరిలో రోహిత్ రెండు వారాల పాటు సెల్ఫ్ నామినేట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇది ఖచ్చితంగా అతనికి రాంగ్ డెసీషన్ అవుతుంది. అలాగే, వాసంతీతో ఆర్గ్యూమెంట్స్ కూడా పెద్దగా చేయకుండానే ఒప్పుకోవడం అనేది కూడా రోహిత్ కి మైనస్ అవుతుంది.

ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ లో రోహిత్ ఈ డెసీషన్ తీస్కోబోతున్నాడు. నిజానికి రోహిత్ ఇలా చేయడం వల్ల వచ్చే రెండు వారాలు అతనికి డేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటి వరకూ రోహిత్ గేమ్ పరంగా ఎక్కడా కూడా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. అలాగే, టాస్క్ ల్లో కూడా ఎగ్రెసివ్ గా ఆడింది ఎక్కడా లేదు. అందుకే, రోహిత్ సెల్ఫ్ నామినేట్ అయితే వచ్చే రెండు వారాలు సేఫ్ అవుతాడా లేదా అనేది సందేహంగానే మారింది.

ఈవారం కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎవరు వచ్చే ఛాన్స్ ఉందంటే., బ్యాటరీ రీఛార్జ్ కోసం త్యాగాలు చేసిన వారిని హౌస్ మేట్స్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. అందుకే, ఈసారి రోహిత్ , బాలాదిత్య, శ్రీహాన్, అలాగే ఫైమా ఖచ్చితంగా కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. వీళ్లు కాకుండా కెప్టెన్ రేవంత్ ఎవరినైనా ఎంచుకుంటే వాళ్లు కూడా ఈసారి కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం ఉంది. మరి ఈవారం ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus